ETV Bharat / business

ఐఫోన్‌ వర్సెస్​ ఆండ్రాయిడ్‌: ఎవరు గెలిచారు? - అండ్రాయిడ్​ మొబైల్​ కొనుగోళ్లు 2020

2020లో ఎప్పుడు.. ఏం జరుగుతుందా? అని అందరూ గుబులుగుబులుగానే గడిపారు. మొదటి రెండు నెలలు బాగుందనుకున్నా.. ఆ తర్వాత అంతా 'కరోనా' మయమే. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లోనూ బాగుపడ్డ ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే.. అది మొబైల్‌ రంగమే. మహమ్మారి కారణంగా చాలా మంది ఇళ్లలో ఉండిపోవడం వల్ల చరవాణి వినియోగం అమాంతం పెరిగిపోయింది. ఆ మాటకొస్తే మీరు కూడా ఎక్కువే వాడేసుంటారు. ఈ నేపథ్యంలో గతేడాది మొబైల్​ వినియోగంలో వచ్చిన మార్పులను ఐఫోన్‌ వర్సెస్​ ఆండ్రాయిడ్‌గా చూస్తే..

Android vs Iphone
ఐఫోన్‌ X ఆండ్రాయిడ్‌: ఎవరు గెలిచారు?
author img

By

Published : Jan 9, 2021, 7:41 PM IST

మొబైల్ యాప్స్‌.. గేమింగ్‌ యాప్స్‌ విషయంలో గతేడాది రికార్డు సృష్టించాయి. ఏటా ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో యూజర్లు ఖర్చు పెట్టే మొత్తం కూడా అదే స్థాయిలో పెరిగిందట. గతేడాది విద్య, ఉద్యోగం, వినోదం కోసం వినియోగదారులు మొబైల్‌ వాడకం పెంచేశారు. దీంతో 2020లో యాప్‌ స్టోర్‌, ప్లేస్టోర్‌లో మొత్తంగా సుమారు పది వేల కోట్ల డాలర్ల వ్యాపారం జరిగిందని సెన్సర్‌ టవర్‌ స్టోర్‌ ఇంటెలిజెన్స్‌ నివేదిక వెల్లడించింది. 2019 కంటే ఇది 30 శాతం అధికం. అయితే.. ఎప్పటిలాగే వ్యాపారంలో ఆండ్రాయిడ్‌పై యాప్‌ స్టోర్‌ పైచేయి సాధించింది.

యూజర్లు ఖర్చు పెట్టింది ఎంతంటే?

గూగుల్‌ ప్లే స్టోర్‌ రెవెన్యూ కంటే యాపిల్‌ స్టోర్‌ ఆదాయం 87.3 శాతం ఎక్కువ కావడం గమనార్హం. 2020లో యూజర్లు యాప్‌ స్టోర్‌లో 7,230 కోట్ల డాలర్లు ఖర్చు చేయగా.. ప్లే స్టోర్‌లో 3,860 కోట్ల డాలర్లు ఖర్చు చేశారు. అదే 2019లో చూస్తే యాప్‌ స్టోర్‌లో 5,550 కోట్ల డాలర్లు, ప్లే స్టోర్‌లో 2,970 కోట్లు డాలర్లు వెచ్చించారు.

ఫస్ట్‌ టైమ్‌ ఇన్‌స్టాల్స్‌ లెక్క ఇదీ..

2020లో రెవెన్యూ విషయంలోనే కాకుండా.. ఇన్‌స్టాల్స్‌ విషయంలోనూ యాప్‌ స్టోరే అగ్రగామిగానే నిలిచింది. యాప్‌ స్టోర్‌, ప్లే స్టోర్‌ కలిపి మొత్తంగా 14,300 కోట్ల యాప్స్‌ను తొలిసారి ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. అదే 2019లో చూస్తే ఈ సంఖ్య 11,550 కోట్లు ఉంది. అంటే గతేడాది 23.7 శాతం ఎక్కువగా ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు.

తొలి స్థానం 'టిక్‌ టాక్‌'దే..

గతేడాది యాప్స్​ ఆదాయం విషయంలో టిక్‌టాక్‌​ అగ్రస్థానంలో నిలిచింది. చైనీస్‌ వెర్షన్‌ డూయిన్‌తో కలిపి లెక్కిస్తే 2019తో పోలిస్తే టిక్‌ ఆదాయంలో 600 శాతం వృద్ధి కనిపించింది. 2020లో టిక్‌ టాక్‌ ఆదాయం 120 కోట్ల డాలర్లుగా నమోదైందని తెలుస్తోంది. అయితే.. గూగుల్‌ ప్లే వివరాల ప్రకారం ఎక్కువ రెవెన్యూ సాధించిన యాప్‌ గూగుల్‌ వన్‌. 2019తో పోలిస్తే 41.9 శాతం వృద్ధితో 44.4 కోట్ల డాలర్ల ఆదాయం సాధించింది.

ఇదీ చదవండి: ఆభరణాల విలువ రూ.2 లక్షలు దాటితే కేవైసీ తప్పనిసరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.