ETV Bharat / business

మహీంద్ర ఆమె ఫొటో కోసం అంత వెతికారా..? - ఆనంద్​ మహీంద్ర

ట్విట్టర్​లో​ ఎంతో చురుగ్గా ఉంటారు మహీంద్ర గ్రూపు ఛైర్మన్​ ఆనంద్​ మహీంద్ర. సందేశాత్మక, సరదా ట్వీట్లు ఎన్నో పోస్టు చేస్తుంటారు. రీట్వీట్​​ చేస్తుంటారు. స్ఫూర్తిదాయక కథనాలను పంచుకుంటారు. ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి ఫొటో కోసం వెతికి.. మొత్తానికి ట్విట్టర్​లో ఓ వ్యక్తి ద్వారా పొందారు. ఎవరా అమ్మాయి?

మహీంద్ర ఆమె ఫొటో కోసం అంత వెతికారా..?
author img

By

Published : Apr 21, 2019, 5:11 PM IST

ఆనంద్​ మహీంద్ర నిత్యం బిజీబిజీగా ఉండే వ్యాపారవేత్త. మహీంద్ర సంస్థల ఛైర్మన్​. ఎంత తీరిక లేకుండా ఉన్నా.. ట్విట్టర్​లో మాత్రం చాలా చురుకుగా ఉంటారు. సామాజిక విషయాల నుంచి సరదా సంఘటనల వరకు.. స్ఫూర్తిదాయక అంశాల నుంచి కళాత్మక వీడియోల వరకు... అన్నింటినీ ట్విట్టర్​లో పంచుకుంటారు. ఆయన ట్వీట్లతో సెలబ్రిటీలైన సామాన్యులు ఉన్నారు.

ట్వీట్లతో మహీంద్ర ఆలోచింపజేస్తారు. హాస్యం పండిస్తారు. అలాంటి ఆయన ఈ మధ్య కాలంలో ఓ ఫొటో కోసం తెగ వెతికేశారు. ఆ ఫొటో ఎవరిది? ఈ మధ్యకాలంలో ఆయన చేసిన ఆసక్తికర ట్వీట్లు ఏవి..?

ఆ ఫొటో దొరికితే స్ర్కీన్​సేవర్​గా పెట్టుకుంటా...

ఈ నెల ఆరో తేదీన కేరళలోని త్రిస్సుర్​లో ఓ పదో తరగతి విద్యార్థిని ఫైనల్స్​ పరీక్షలు రాసేందుకు గుర్రంపై స్వయంగా స్వారీ చేస్తూ వెళ్లింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్​ అయింది. ఆ వీడియోను ఆనంద్​ మహీంద్ర చూశారు. ట్విట్టర్​లో షేర్​ చేశారు. ఆ అమ్మాయిని అభినందించారు.

  • Does anyone in Thrissur know this girl? I want a picture of her and her horse as my screen saver. She’s my hero..The sight of her charging to school filled me with optimism for the future... https://t.co/6HfnYAHHfu

    — anand mahindra (@anandmahindra) April 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"త్రిస్సుర్​లో ఎవరికైనా ఈ అమ్మాయి తెలుసా? ఆ అమ్మాయి, ఆమె గుర్రం ఫొటోలు నాకు కావాలి. నేను స్క్రీన్​సేవర్​గా పెట్టుకుంటా. ఆమె నా హీరో. ఆమె పాఠశాలకు వెళుతున్న విధానం, పట్టుదల చూస్తే భవిష్యత్తులో సమస్యలపై పోరాడేందుకు నాలో ఆశావాదం పెరుగుతోంది."
-- ఆనంద్​ మహీంద్ర ట్వీట్​

ఈ ట్వీట్​తో ఆ బాలిక మరింత ఖ్యాతిగాంచింది. వేల మంది ఆయన ట్వీట్​కు స్పందించారు. సుబిన్​ అనే వ్యక్తి ఆయనకు మెయిల్​ ద్వారా కృష్ణ అనే ఆ అమ్మాయి ఫొటో పంపారు.

  • I had tweeted a video about Krishna, the inspiring young lady who rode her horse to her school exam in Thrissur. I asked if anyone knew her since I wanted a pic to use as a screensaver. I received this in my mail today. Many thanks Subin! pic.twitter.com/4BMu1JHxSL

    — anand mahindra (@anandmahindra) April 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"త్రిస్సుర్​లో పరీక్ష రాసేందుకు పాఠశాలకు గుర్రంపై వెళ్లిన కృష్ణ అనే స్ఫూర్తిదాయక విద్యార్థిని వీడియో గురించి నేను కొంతకాలం క్రితం ట్వీట్​ చేశా. స్క్రీన్​సేవర్​గా పెట్టుకునేందుకు ఫొటో కావాలని అడిగా. మెయిల్​ ద్వారా ఇప్పుడు ఫొటో అందుకున్నా. సుబిన్​కు​ ధన్యవాదాలు."
-- ఆనంద్​ మహీంద్ర ట్వీట్​

రాజకీయ సభలో ఒకేఒక్కడు..

ఈ నెల 10న ఓ ఫొటోను ట్వీట్​ చేశారు మహీంద్ర. అది ఓ రాజకీయ సమావేశం. వేదికపై ఒకరు ప్రసంగిస్తుండగా.. ఓ ఐదుగురు కుర్చీలపై కూర్చున్నారు. అయితే ఆయన ప్రసంగం వినేందుకు ఒక్కరు మాత్రమే కింద కూర్చుకున్నారు. ఈ ఫొటో షేర్​ చేస్తూ సరదా ట్వీట్​ చేశారు మహీంద్ర.

  • And as campaigning comes to an end someone dropped this pic in my #whatsappwonderbox Don’t know where this was taken or how old it is, but it sums up the wonder of democracy better than all the photos of mammoth crowds. Everyone has a voice & some’one’ will always listen! pic.twitter.com/kNhWhNsnqT

    — anand mahindra (@anandmahindra) April 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ప్రచారం ముగిసింది. ఎవరో నాకు ఈ ఫొటో వాట్సప్​లో పంపారు. ఇదెక్కడ జరిగిందో తెలియదు. ఎప్పుడు జరిగిందో తెలియదు. కానీ ఈ ఫొటో ప్రజాస్వామ్యంలో అద్భుతాన్ని చూపుతోంది. ప్రజలతో నిండిపోయిన చాలా ఫొటోల కంటే ఇది చాలా మేలైంది. ప్రతి ఒక్కరికీ అభిప్రాయాలు ఉంటాయి. ఎవరో 'ఒకరు' కచ్చితంగా వింటారు."
-- ఆనంద్​ మహీంద్ర ట్వీట్​

రెస్టారెంట్​కు భార్యతో వెళ్లేందుకు ఆలోచించాల్సిందే

చైనాలోని ఓ రెస్టారెంట్​ మెనూ ఫొటోను ట్విట్టర్​లో పెట్టారు మహీంద్ర. అందులో డెలీషియస్​ రోస్టెడ్​ హస్బెండ్​ అనే వంటకం పేరు చైనీస్​, ఇంగ్లిష్​లో ఉంది. దీనిపై సరదా వ్యాఖ్య చేశారు.

"ఈ రెస్టారెంట్​కు నా భార్యతో వెళ్లేందుకు ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించాలి. ఆమెకు ఏ సృజనాత్మక ఆలోచన రాకూడదని కోరుకుంటున్నా."
-- ఆనంద్​ మహీంద్ర ట్వీట్​

చౌకైన టాప్​ ఉండే వాహనమిదేనేమో..

బైక్​పై వెళుతూ ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు అట్టపెట్టతో చేసిన వినూత్న ప్రయోగం ఫొటోను ట్వీట్​ చేశారు మహీంద్ర.

  • In my #whatsappwonderbox today. Pre-monsoon temperatures are intensifying but our innovative countrymen know how to ‘beat the heat’ No clue what the Road transport authorities will make of this, but it seems like the cleverest & cheapest ‘soft-top’ vehicle I have ever seen! 😊 pic.twitter.com/PvnHU8naqB

    — anand mahindra (@anandmahindra) April 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఎండ చాలా తీవ్రంగా ఉంది. సృజనాత్మక ఆలోచనున్న మనవారికి వేడిని ఎలా జయించాలో తెలుసు. రోడ్డు రవాణా సంస్థ వారు ఇవి తయారో చేస్తారో లేదో తెలియదు. ఇంతవరకు నేను చూసిన తెలివైన, చౌకైన సాఫ్ట్​టాప్​ వాహనం ఇదే."
-- ఆనంద్​ మహీంద్ర ట్వీట్

RESTRICTION SUMMARY: AP Clients Only
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kiev, 21 April 2019
1. Incumbent president Petro Poroshenko casting his ballot in run off poll
2. Poroshenko leaving
STORYLINE:
Incumbent Ukraine President Petro Poroshenko cast his ballot on Sunday, still struggling to fend off a strong challenge by a comedian who denounces corruption and plays the role of president in a TV sitcom.
Opinion surveys ahead of Sunday's vote have shown 53-year-old Poroshenko trailing far behind comic actor Volodymyr Zelenskiy, reflecting public dismay with endemic corruption, a moribund economy and a five-year fight against Russia-backed insurgents in the country's east.
Zelenskiy, 41, got twice as many votes as Poroshenko in the first round three weeks ago. Like his sitcom character, a teacher thrust into the presidency after a video of him blasting corruption goes viral, he has focused on fighting graft, riding the wave of public distrust of Ukraine's political elite.
Poroshenko, a billionaire sweet magnate before taking office, has relied on traditional political barnstorming, using sympathetic television stations to extensively cover his appearances.
Zelenskiy, however, has largely stayed away from the campaign trail and eschewed interviews.
He has run his campaign mainly on Instagram, where he has 3.7 million followers.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.