సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. తమిళనాడుకు చెందిన కమలాత్తాళ్‌కు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. పేద కూలీలకు కేవలం రూపాయికే 4 ఇడ్లీలు అందిస్తున్న ఆమె పనికి ముగ్ధులయ్యారు. ఆమె వ్యాపారానికి కావాల్సిన ఆర్థిక సహాయ సహకారాలు అందించేందుకు సన్నద్ధమయ్యారు.
కట్టెల పొయ్యి ఇంకానా?
ఎనభై ఏళ్ల వయస్సులోనూ కమలాత్తాళ్... కట్టెల పొయ్యిపైనే ఇడ్లీలు, బోండాలు చేస్తోంది. ఇది ఆమె ఆరోగ్యానికి హాని చేస్తుందని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. ఆమెకు తెలిసినవారు ఎవరైనా ఉంటే.. గ్యాస్ స్టవ్ కొనిస్తానని ప్రకటించారు.
మంచి పనికి... స్పందన
మహీంద్రా ప్రకటన చూసి స్పందించిన 'భారత్ గ్యాస్ కోయంబత్తూరు' వారు కమలాత్తాళ్‌కు ఎల్పీజీ గ్యాస్ స్టవ్ అందించారు.
"ఇది అద్భుతం. కమలాత్తాళ్‌కు ఆరోగ్య బహుమతి(ఎల్పీజీ గ్యాస్ స్టవ్) అందించిన భారత్ గ్యాస్ కోయంబత్తూర్‌కి ధన్యవాదాలు. నేను ముందే చెప్పినట్లుగా.. ఇకపై నిరంతరం ఆమెకు అయ్యే ఎల్పీజీ గ్యాస్ ఖర్చులు నేను భరిస్తాను. ఇది నాకు ఎంతో సంతోషకరమైన విషయం. ధన్యవాదాలు!"
- ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్
ఇదీ చూడండి: 'పద్మా'లకు పేర్లను నామినేట్ చేయండి: అమిత్ షా