Amul milk price increase: అమూల్ బ్రాండ్ పాలు మరింత ప్రియం కానున్నాయి. మంగళవారం నుంచి లీటరు పాల ధరను రూ.2 మేర పెంచుతున్నట్లు ఆ బ్రాండ్‌ను మార్కెటింగ్ చేసే గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్య(జీసీఎంఎంఎఫ్) ప్రకటించింది. లీటరుకు రూ.2 పెంపు అంటే.. ఎంఆర్పీపై 4శాతమని.. సగటు ఆహార ద్రవ్యోల్బణంతో పోల్చితే ఇది చాలా తక్కువని పేర్కొంది.
"ఇంధనం, ప్యాకేజీ, రవాణా, పశువుల దాణా ఖర్చులు పెరిగాయి. ఫలితంగా పాల ఉత్పత్తి, నిర్వహణ ఖర్చులు ఎగబాకాయి. అందుకే పాల ధర పెంచాల్సి వచ్చింది. రూ.2 పెంపుతో అహ్మదాబాద్, దిల్లీ ఎన్సీఆర్, కోల్‌కతా, ముంబయి మెట్రో మార్కెట్లలో ఫుల్ క్రీమ్ మిల్క్ లీటరు ధర రూ.60 అవుతుంది. టోన్డ్ మిల్క్ ధర అహ్మదాబాద్‌లో రూ.48, దిల్లీ ఎన్సీఆర్, ముంబయి, కోల్‌కతాలో రూ.50గా ఉంటుంది." అని ఓ ప్రకటనలో తెలిపింది జీసీఎంఎంఎఫ్.
ఖర్చుల పెరుగుదల దృష్ట్యా పాడి రైతులకు ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచినట్లు గుర్తు చేసింది అమూల్ యాజమాన్యం. పాలు, పాల ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయంలో 80శాతాన్ని రైతులకే ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: 'ఆఫీస్‌లకు తర్వాత.. ముందు సిటీకి రండి'