స్టాక్‌మార్కెట్లు వరుసగా 3వ సెషన్లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూలతలే ఇందుకు కారణం. బొంబాయి స్టాక్ ఎక్సేంజి సూచీ-సెన్సెక్స్ ఆరంభ ట్రేడింగ్‌లోనే 100 పాయింట్లకు పైగా కోల్పోయింది. ప్రస్తుతం 129 పాయింట్లు క్షీణించి... 38 వేల 993 వద్ద ట్రేడవుతోంది.
జాతీయ స్టాక్ ఎక్సేంజి సూచీ- నిఫ్టీ 35 పాయింట్లు పతనమైంది. ప్రస్తుతం 11 వేల 650 మార్కు వద్ద కదలాడుతోంది.
విద్యుత్ రంగం మినహా.. లోహ, ఆటో మొబైల్, బ్యాంకింగ్, ఐటీ రంగాలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.
లాభనష్టాల్లోనివివే...
ఓఎన్జీసీ 1.63, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 1.38 శాతం మేర లాభపడ్డాయి. ఐఓసీ, బీపీసీఎల్, ఐషర్ మోటర్స్ లాభాల జాబితాలో ఉన్నాయి.
జీ ఎంటర్టైన్మెంట్స్ లిమిటెడ్, యూపీఎల్, టాటా స్టీల్, భారతీ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్, హెచ్‌సీఎల్ టెక్ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
రూపాయి స్వల్ప వృద్ధి...
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ... 69. 32 వద్ద ట్రేడవుతోంది.