కరోనా మహమ్మారి చికిత్సలో ఉపయోగిస్తున్న ఔషధాల్లో ఒకటైన ఫాబిఫ్లూ ఏప్రిల్‌లో రూ.351కోట్ల అమ్మకాలు సాధించి.. రిటైల్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన బ్రాండ్‌గా అవతరించింది. ఇది మార్చి నెలతో పోలిస్తే ఆరు రెట్లు అధికమని ఇండియన్ మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్(ఏఐఓసీడీ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మల్టీవిటమిన్ డ్రగ్ జింకోవిట్ స్థానంలో విరివిగా అమ్ముడవుతోన్న ఫాబిఫ్లూ.. జపనీస్ యాంటీ ఇన్ఫ్లుయెంజా ఔషధానికి సాధారణ వెర్షన్.
డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) గత జూన్‌లో గ్లెన్‌మార్క్ ఫాబిఫ్లూ తయారీ, మార్కెటింగ్ అనుమతులను జారీ చేసింది. తేలికపాటి లక్షణాలున్న కరోనా రోగుల చికిత్సలో ఈ ఔషధం 80 శాతానికి పైగా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
నోటి ద్వారా తీసుకునే యాంటీవైరల్ డ్రగ్ అయిన ఫాబిఫ్లూను ప్రస్తుతం అత్యవసర సమయాల్లో, తక్కువ మోతాదులో వాడేందుకే సూచిస్తున్నారు వైద్యులు.
ఇవీ చదవండి: 'పల్మనరీ ఫైబ్రాసిస్' వ్యాధికి గ్లెన్‌మార్క్ ఔషధం