ETV Bharat / business

'వాట్సాప్​, జియోమార్ట్​ కలయికతో విప్లవాత్మక మార్పులు' - రిలయన్స్

Ambani to detail post-Covid business plan at AGM
రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వ సభ్య సమావేశం
author img

By

Published : Jul 15, 2020, 1:58 PM IST

Updated : Jul 15, 2020, 3:10 PM IST

15:09 July 15

అంకుర సంస్థలకు అండగా జియో..

  • భారతీయ అంకుర సంస్థలకు అత్యుత్తమ భాగస్వామిగా రిలయన్స్‌ జియో: ముకేశ్‌
  • భారతీయ అంకుర సంస్థలు వారి లక్ష్యాలు చేరుకునే దిశా జియో సహకారం: ముకేశ్‌

14:59 July 15

విప్లవాత్మక మార్పులు...

  • ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌తో జియో వ్యూహాత్మక ఒప్పందాలు: ముకేశ్‌
  • వాట్సాప్‌, జియోమార్ట్ కలయిక విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుంది: ముకేశ్‌
  • ప్రస్తుతమున్న అందుబాటు ధరల్లోనే 5జీ స్మార్ట్‌ ఫోన్లు: ముకేశ్‌
  • 2జీ ముక్త్‌ నినాదంతో సరికొత్త స్మార్ట్‌ ఫోన్లు: ముకేశ్‌
  • దేశంలోని ఫీచర్‌ ఫోన్ల వినియోగదారులు అందరికి స్మార్ట్‌ ఫోన్లు అందించడమే లక్ష్యం: ముకేశ్‌

14:48 July 15

'జియో-5జీ సేవలతో ప్రపంచ దశ, దిశ మారనుంది'

  • స్పెక్ట్రమ్‌ కేటాయింపులు రాగానే జియో 5జి సేవలు అందుబాటులోకి: రిలయన్స్‌
  • జియో-5జి సేవలతో ఆధునిక ప్రపంచ దశ, దిశ మారనుంది: రిలయన్స్‌
  • రవాణా, వ్యవసాయం, వైద్యం, విద్యారంగాల్లో జియో-5జితో నూతన శకం: రిలయన్స్‌
  • కొనుగోలుదారులు, ఉత్పత్తిదారులు, కిరాణా దుకాణాల అనుసంధాన వేదికగా జియో మార్ట్‌: రిలయన్స్
  • జియో మార్ట్‌తో కిరాణా దుకాణాలకు ఆధునిక, సాంకేతిక సొబగులు: రిలయన్స్‌
  • జియో మార్ట్‌తో 48 గంటల్లోనే సాధారణ కిరాణా దుకాణాలకు కొత్త రూపు: రిలయన్స్‌
  • వినియోగదారుల వంద శాతం అవసరాలు తీర్చేలా జియో మార్ట్‌ కిరాణా దుకాణాలు: రిలయన్స్‌
  • జియో మార్ట్‌ ద్వారా నమ్మకమైన, నాణ్యమైన ఉత్పత్తులు: రిలయన్స్‌
  • జియో మార్ట్‌లో తొలి ఆర్డర్‌కు కరోనా కాంప్లిమెంటరీ కిట్‌ ఉచితం: రిలయన్స్‌

14:37 July 15

  • జియో గ్లాస్‌ పేరుతో కొత్త ఆవిష్కరణ: రిలయన్స్‌
  • టీవీ ప్రసారాల్లో సరికొత్త అనుభూతులు అందిస్తాం: రిలయన్స్‌
  • జియో గ్లాస్‌తో 25కు పైగా సాంకేతిక కార్యక్రమాలు అనుసంధానం: రిలయన్స్‌
  • జియో గ్లాస్‌తో టెలీ కాన్ఫరెన్స్, వీడియో కాలింగ్‌లో సరికొత్త విప్లవం: రిలయన్స్‌
  • జియో గ్లాస్ ద్వారా డిజిటల్ తరగతుల నిర్వహణలో సరికొత్త సేవలు: రిలయన్స్‌
  • సురక్షితమైన, చౌకైన వీడియో కాన్ఫరెన్స్ యాప్‌గా జియో మీట్‌: రిలయన్స్‌
  • జియో మీట్ ద్వారా అపరిమిత సేవలు అందుకోవచ్చు: రిలయన్స్‌

14:36 July 15

  • త్వరలో పూర్తి దేశీయంగానే రిలయన్స్ 5-జి సేవలు: ముకేశ్‌
  • ప్రధాని ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్‌కు రిలయన్స్ 5-జీ సేవలు అంకితం: ముకేశ్‌
  • జియో 5-జి సాంకేతికతను దేశంలోనే అభివృద్ధి చేశాం: ముకేశ్‌
  • దేశంలో ఈ సేవల పరిశీలన తర్వాత ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తాం: ముకేశ్‌
  • జియో తన సేవల విషయంలో వందశాతం మేధోహక్కులు కలిగివుంది: ముకేశ్‌
  • మేడిన్ ఇండియా నినాదానికి మరింత సార్థకత చేకూరుస్తాం: రిలయన్స్‌
  • జియో ఫైబర్‌, జియో సెట్‌టాప్‌ బాక్స్ సేవలు సంతృప్తికరంగా ఉన్నాయి: రిలయన్స్‌
  • జియో టీవీ ప్లస్‌లో 12 ఓటీటీ వేదికలు: రిలయన్స్‌
  • ప్రధాన ఛానల్స్ అన్నీ జియో టీవీ ప్లస్‌లో చేర్చాం: రిలయన్స్‌
  • జియో ఫైబర్ ద్వారా టీవీ ప్రసారాల్లో కొత్త ఒరవడి తీసుకొచ్చాం: రిలయన్స్‌
  • సెట్ టాప్ బాక్స్‌లోని యాప్ స్టోర్ ద్వారా ఇంటర్నెట్ సేవలు: రిలయన్స్‌
  • సెట్ టాప్ బాక్సులో ఏ యాప్‌ డెవలప్ అయినా తమ యాప్‌లు పెట్టుకోవచ్చు: రిలయన్స్‌
  • ఆ యాప్ సేవల ద్వారా ఆదాయం పొందవచ్చు: రిలయన్స్‌

14:24 July 15

భారత్​లో వచ్చే ఏడాదిలోనే జియో 5జీ: ముఖేశ్ అంబానీ

వచ్చే ఏడాది ప్రారంభం నాటికి జియో 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామని ముఖేశ్ అంబానీ తెలిపారు.

14:17 July 15

గూగుల్​తో రిలయన్స్ భాగస్వామ్యం: ముకేశ్ అంబానీ

ప్రపంచ ప్రఖ్యాత గూగుల్​ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్​తో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చింది: ముకేశ్ అంబానీ

14:14 July 15

150 కోట్ల విలువైన కంపెనీగా రిలయన్స్: ముఖేశ్ అంబానీ

రిలయన్స్ ఏజీఎంలో ముకేశ్ అంబానీ వాటాదార్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.  

"ఆధునిక మానవ చరిత్రలో దారుణమైన సంక్షోభాన్ని కరోనా తెచ్చింది. అయితే సంక్షోభంలోనే అవకాశాలు అందుకునే దిశగా రిలయన్స్ ప్రయత్నం చేసింది. డిజిటల్ అనుసంధాన వేదికగా జియో మీట్​ను తీసుకొచ్చాం.  

ఫేస్​బుక్​ నుంచి క్వాల్​కం వరకు విదేశీ సంస్థల భాగస్వామ్యంతో 150  బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ గల సంస్థగా నిలిచాం. సాంకేతిక విపణిలో శరవేగంగా విస్తరిస్తున్నాం." - ముకేశ్ అంబానీ

14:02 July 15

రిలయన్స్ ఏజీఎంలో మాట్లాడుతున్న ముఖేశ్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్  వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) ప్రారంభం అయ్యింది. సంస్థ అధిపతి ముఖేశ్ అంబానీ వాటాదార్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

13:36 July 15

మరికాసేపట్లో ప్రారంభం కానున్న రిలయన్స్ ఏజీఎం

రిలయన్స్ ఇండస్ట్రీస్  వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో ఈసారి ఏజీఎంను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నారు.  

దేశంలో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. సంస్థకు చెందిన టెలికాం విభాగం జియోకు వచ్చిన భారీ పెట్టుడులతో ఈ స్థాయికి ఎదిగింది. ఏటా వాటాదారులను ఉత్సాహపరిచే ప్రకటనలు చేసే రిలయన్స్.. ఈ సారి రుణరహితంగా మారిపోయింది. మరి తాజా ఏజీఎంలో ఎలాంటి ప్రకటనలు చేస్తారోనని అందరిలో ఉత్కంఠ నెలకొని ఉంది.

Last Updated : Jul 15, 2020, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.