రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం.. బ్రిటన్‌లో స్థిరపడాలి(mukesh ambani london) అనుకుంటోందని వచ్చిన వార్తలను ఆ సంస్థ ఖండించింది. అంబానీ కుటుంబానికి భారత్ తప్ప మరే ఇతర దేశానికి రీలొకేట్ అవ్వాలన్న ఆలోచనే లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది(mukesh ambani house).
బ్రిటన్‌లోని బకింమ్షైర్లో ఉన్న స్టోక్ పార్క్‌లో 300ఎకరాల్లో ఉన్న నివాసంలో ముకేశ్ అంబానీ కుటుంబం శాశ్వతంగా స్థిరపడాలని యోచిస్తున్నట్టు పలు వార్తలు సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొట్టాయి. ఆ వార్తలు నిరాధారమని, పూర్తిగా ఊహాగానాలేనని రిలయన్స్ స్పష్టం చేసింది.
"రిలయన్స్ ఛైర్మన్, ఆయన కుటుంబం.. లండన్‌తో పాటు ప్రపంచంలోని మరే ఇతర ప్రాంతంలోనూ స్థిరపడాలని అనుకోవడం లేదు. ఈ విషయాన్ని సంస్థ స్పష్టం చేయాలని భావిస్తోంది."
-రిలయన్స్ ప్రకటన.
లండన్‌లోని స్టోక్ పార్క్‌ను అంబానీ కుటుంబం రూ.592కోట్లకు ఇటీవలే కొనుగోలు చేసింది. ఆ తర్వాత కుటుంబం విదేశీ పర్యటనకు వెళ్లింది. దీంతో కుటుంబం మొత్తం లండన్‌కు రీలొకేట్ అయిపోతుందని ఊహాగానాలు జోరందుకున్నాయి.
స్థానిక నిబంధనలకు కట్టుబడి.. స్టోక్ పార్క్‌ను గొప్ప గోల్ఫింగ్, స్పోర్ట్ రిసార్ట్‌గా మలిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సంస్థ తన ప్రకటనలో వెల్లడించింది. అయితే అంబానీ విదేశీ పర్యటనపై మాత్రం సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు(reliance news today).
ఇదీ చూడండి:- 100 బిలియన్ డాలర్ల ప్రత్యేక క్లబ్‌లోకి అంబానీ!