ETV Bharat / business

జుకర్​బర్గ్​ను వెనక్కి నెట్టిన అంబానీ, అదానీ - మార్క్ జుకర్​బర్గ్​

Richest persons in the world: ఆసియా కుబేరులు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ అస్తుల విలువ ఇప్పుడు మార్క్​జుకర్​బర్గ్​ కంటే ఎక్కువ. మెటా షేర్లు గురువారం రికార్డు స్థాయిలో కుప్పకూలిన కారణంగా ఒక్కరోజులోనే జుకర్​బర్గ్​ సంపద 29 బిలియన్​ డాలర్లు తగ్గింది. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 12వ స్థానానికి పడిపోయారు.

ambani, adani-now-richer-than-mark-zuckerberg
జుకర్​బర్గ్​ను వెనక్కి నెట్టిన అంబానీ, అదానీ
author img

By

Published : Feb 4, 2022, 2:26 PM IST

Richest persons in the world: ప్రపంచ కుబేరుల జాబితాలో నిన్నటి వరకు టాప్​-10లో ఉన్న మార్క్​జుకర్​బర్గ్ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆయనకు చెందిన మెటా సంస్థ షేర్లు గురువారం రికార్డు స్థాయిలో 26శాతం పతనమయ్యాయి. దీంతో 24 గంటల్లోనే 29 బిలియన్​ డాలర్ల జుకర్​బర్గ్ సంపద ఆవిరైంది. చరిత్రలో నమోదైన అత్యంత భారీ నష్టాల్లో ఇది రెండోది కావడం గమనార్హం.

జుకర్​బర్గ్​కు సంపద భారీగా తగ్గడం వల్ల ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 12వ స్థానానికి పడిపోయారు. ఫలితంగా ఆయన అస్తుల విలువ భారత కుబేరులు అనిల్​ అంబానీ, గౌతమ్​ అదానీ కంటే తక్కువగా నమోదైంది. అంతర్జాతీయ కుబేరుల జాబితాలో 10వ స్థానంలో ఉన్న అదానీ ఆస్తులు విలువ 90.1 బిలియన్ డాలర్లు కాగా.. 11వ స్థానంలో ఉన్న అంబానీ ఆస్తుల విలువ 90 బిలియన్​ డాలర్లుగా ఉంది. జుకర్​బర్గ్​ ఆస్తుల విలువ 89 బిలియన్​ డాలర్లకే పరిమితమైంది.

Top 10 rich persons

మరోవైపు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద మాత్రం మరో 20 బిలియన్ డాలర్లు పెరిగింది. అమెజాన్​ భారీ లాభాలు ఆర్జించడం వల్ల ఇది సాధ్యమైంది.

మెటా షేర్లు గురువారం 26 శాతం పతనమవ్వడం వల్ల 200 బిలియన్​ డాలర్ల నష్టం మూటగట్టుకుంది. ఇందులో 12.8శాతం వాటా కలిగిన జుకర్​బర్గ్​కు 29 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది.

గతేడాది నవంబర్​లో టెస్లా అధినేత ఎలాన్ మస్క్​ ఒక్కరోజులనే 35 బిలియన్ ​డాలర్లు పోగోట్టుకున్నారు. ఆ తర్వాత అత్యధిక నష్టం చవిచూసింది జుకర్​బర్గే కావడం గమనార్హం.

ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో 232 బిలియన్​ డాలర్లతో ఎలాన్​ మస్క్​ మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత బెర్నార్డ్ అర్నాల్ట్​ 193.6 బిలియన్​ డాలర్లతో రెండో స్థానంలో, జెఫ్​ బెజోస్​ 164.8 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. బిల్​గేట్స్​ 131.9 బిలియన్​ డాలర్ల సంపదతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.

ఇదీ చదవండి: తగ్గిన ఫేస్​బుక్ యూజర్ల సంఖ్య.. 18 ఏళ్లలో ఇదే తొలిసారి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.