ETV Bharat / business

అమెజాన్​ అధినేత ఉదారత- దాతృత్వంలోనూ టాప్​ ​ - అమెజాన్​ అధినేత బెజోస్​ అత్యధిక విరాళం

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌బెజోస్‌ దాతృత్వంలోను అందరికీ అందనంత ఎత్తుకు చేరారు. కరోనాతో ప్రపంచం సతమతమైన 2020లో భారీ వితరణల ద్వారా ఎంతో మందికి అండగా నిలిచారు. గతేడాది ఎక్కువ మొత్తం విరాళాలుగా ఇచ్చిన వారి పేర్లతో క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రఫీ రూపొందించిన వార్షిక జాబితాలో ఈ అమెరికా దానకర్ణుడు అగ్రస్థానంలో నిలిచారు.

Amazon's Bezos tops list of richest charitable gifts in 2020
దాతృత్వంలోనూ అమెజాన్​ అధినేత నెంబర్​ వన్​
author img

By

Published : Jan 5, 2021, 10:37 AM IST

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ మరోసారి తన ఉదాతరతో వార్తల్లో నిలిచారు. ప్రపంచమానవాళికి 2020 కరోనా రూపంలో పెను సవాలుగా మారిన సమయంలో భారీ వితరణలతో జెఫ్ బెజోస్ అందరికీ స్ఫూర్తిగా నింపారు. వాతావరణ మార్పుల అంశంలో పోరాటానికి తాను స్థాపించిన బెజోస్ ఎర్త్ ఫండ్ ద్వారా 16 లాభాపేక్షలేని సంస్థలకు దాదాపు 790 మిలియన్‌ డాలర్లను విరాళంగా ఇచ్చారు. మొత్తంగా 2020లో వాతావరణ మార్పుల విభాగంలో 10 బిలియన్ డాలర్ల మేర వితరణలు చేసినట్లు క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రఫీ తెలిపింది. ఫోర్బ్స్‌ మ్యాగజైన్ ప్రకారం గతేడాదికి బెజోస్‌ ఆదాయం 63శాతం మేర పెరిగి 113 బిలియన్ డాలర్ల నుంచి 184 బిలియన్ డాలర్లకు పెరిగింది.

క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రఫీ వార్షిక జాబితాలో బెజోస్‌ తర్వాత ఫిల్‌నైట్‌, పెన్నీ దంపతులు కూడా ఉన్నారు. ఫిల్‌నైట్‌,పెన్నీ కలిసి గతేడాది 900 మిలియన్‌ డాలర్లు నైట్‌ ఫౌండేషన్‌ ద్వారా వితరణ చేశారు. మరో 300 మిలియన్‌ డాలర్లు యూనివర్సిటీ ఆఫ్‌ ఒరెగాన్‌గి అందించారు. వీరిద్దరి ఆదాయం మార్చి నుంచి డిసెంబర్‌ మధ్య 77శాతం మేర పెరిగింది. వీరి తర్వాతి స్థానంలో కార్పొరేషన్‌ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు ఫ్రెడ్‌ క్యుమర్ 2020 ఏడాదికి 300 మిలియన్‌ డాలర్ల నిధులను మిస్సౌరీ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి విరాళంగా అందించారు. నాల్గవ స్థానంలో ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకెన్‌ బర్గ్‌ ఆయన సతీమని ప్రిసిల్లా చాన్‌ ఉన్నారు. వీరిద్దరూ కలిసి టెక్‌ అండ్‌ సివిక్‌ లైఫ్‌కి 250 మిలియన్‌ డాలర్లు విరాళంగా అందజేశారు. ఆ తరువాతి స్థానంలో అర్థర్‌ బ్లాంక్‌ ఉన్నారు. ఆయన 200 మిలియన్‌ డాలర్లు చిన్న పిల్లల ఫౌండేషన్‌కి అందించారు.

ఇదీ చూడండి: సీఎన్​ఎన్​ కొనుగోలుకు జెఫ్ ​బెజోస్ ఆసక్తి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.