ETV Bharat / business

'ఉద్యోగులకు బంపర్​ ఆఫర్​.. అప్పటివరకు ఇంటి నుంచే పని!' - అమెజాన్ వార్తలు

కార్పొరేట్ సిబ్బందికి బంపర్​ ఆఫర్​ ఇచ్చింది (Amazon News) అమెజాన్ సంస్థ. కార్యాలయాలకు వచ్చే వీలున్నంతవరకు.. ఇంటి నుంచి పనిచేయవచ్చని (Amazon Work From Home) తెలిపింది.

Amazon
Amazon
author img

By

Published : Oct 12, 2021, 10:02 PM IST

ఉద్యోగులు నిరవధికంగా ఇంటి నుంచే పనిచేయవచ్చని (Amazon Work From Home) ప్రకటించింది టెక్ దిగ్గజం ఆమెజాన్. కార్యాలయానికి రాకపోకలు సాగించే వీలు ఉన్నంతవరకు రిమోట్​గా పనిచేసే అవకాశం కల్పిస్తున్నట్లు సంస్థ సీఈఓ ఆండీ జాస్సీ తన బ్లాగ్​లో రాశారు. దీంతో వారానికి మూడు రోజుల పాటు అమెజాన్​ ఉద్యోగులు ఆఫీసుకు రావాల్సి ఉంటుందనే ఊహాగానాలకు (Amazon Return to Office) తెరపడింది.

టీమ్స్​ను ఇంటి నుంచి పనిచేసేందుకు (Amazon WFH News) అనుమతించే నిర్ణయాధికారం కంపెనీ డైరెక్టర్లదేనని జాస్సీ స్పష్టం చేశారు. "ఎక్కువ శాతం బృందాలు ఇంటి నుంచే పనిచేస్తాయని భావిస్తున్నాం. కొందరు​.. ఆఫీస్, ఇల్లు కాంబినేషన్​లో, మిగిలినవారు కస్టమర్ల కోసం పూర్తిగా ఆఫీస్​లోనే పనిచేస్తారు." అని జాస్సీ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా అమెజాన్​లోని (Amazon News) 10 లక్షలకు పైగా ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశం లేదు. రవాణా, డెలివరీ విభాగాల్లో పనిచేసేవారు తప్పక కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక అమెరికాలోని సీటెల్​ హెడ్​క్వార్టర్స్​లో పనిచేసే 50 వేల మంది ఉద్యోగులు కార్యాలయానికి రాకపోతే.. సమీపంలోని రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.

కార్యాలయాలను ఇప్పుడప్పుడే తెరిచేదిలేదని మైక్రోసాఫ్ట్​ గతంలో ప్రకటించింది.

ఇదీ చూడండి: అమెజాన్ వినూత్న గ్యాడ్జెట్లు- ఆశ్చర్యపరిచే ఫీచర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.