దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో' అమెజాన్ ప్రైమ్ డే' పేరిట నిర్వహిస్తున్న ఆఫర్ సేల్స్‌ని నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉండే ఆఫర్ తిరిగి జులైలో మొదలవ్వనున్నట్లు తెలిపింది.
తన ప్లాట్‌ఫాంపై షాపింగ్ చేసే చందాదారులకు మరింత ప్రోత్సాహకాలు అందించేందుకు ఈ టూల్‌ను వినియోగిస్తుంది అమెజాన్. ఫాస్ట్-షిప్పింగ్‌తో పాటు.. అమెజాన్ ప్రైమ్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకునే వారికి డిస్కౌంట్లు ఇస్తుంటుంది.
రియల్మీ సైతం..
మరోవైపు కరోనా ఉద్ధృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా నూతన మోడళ్ల లాంచింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్మీ ప్రకటించింది. కరోనా విజృంభణ వల్ల నూతన మోడళ్ల లాంచింగ్‌లు, వార్షికోత్సవ కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు రియల్మీ ఇండియా సీఈఓ మాధవ్ శేత్ ట్వీట్ చేశారు. 'ఇంట్లోనే సురక్షితంగా, ధైర్యంగా ఉండండి.. త్వరలోనే తిరిగి వస్తాం' అని తెలిపారు.
ఇవీ చదవండి: అమెజాన్ ఫ్రీ గిఫ్ట్.. లింక్ క్లిక్ చేస్తే అంతే!