గాడ్జెట్లలో యాపిల్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే చాలా మందికి యాపిల్ ఐఫోన్ సహా ఇతర ఉత్పత్తులు కొనాలని ఉన్నా ధర ఎక్కువగా ఉండటం వల్ల కొనలేకపోతుంటారు. అయితే ఇలాంటి వారి కోసం ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది.
శనివారం అర్ధరాత్రి (తెల్లవారితే జులై 19) నుంచి యాపిల్ డే పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. ఇందులో ఐఫోన్లు, ఐ మ్యాక్‌లు, ఐ వాచ్‌లు సహా అన్ని రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 25 వరకు ఈ ఆఫర్ కొనసాగుతుందని వెల్లడించింది.
యాపిల్ డే సేల్స్ డిస్కౌంట్లు ఇలా..
యాపిల్ ఐఫోన్ 11, ఐఫోన్ 8 ప్లస్ మోడళ్లపై రూ.5,400 ఫ్లాట్ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు అమెజాన్ తెలిపింది. ఈ రెండు మోడళ్లు వరుసగా రూ.62,900, రూ.41,500లకు లభించనున్నట్లు వెల్లడించింది.
వివిధ గాడ్జెట్ల ఆధారంగా రూ.5,000 నుంచి రూ.7,000 వరకు తగ్గింపు ఉండే అవకాశముంది.
వీటితో పాటు హెచ్డీఎఫ్సీ క్రెడిట్‌కార్డ్, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపే వారికి అదనపు డిస్కౌంట్లు ఉంటాయని అమెజాన్ తెలిపింది. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా వర్తిస్తుందని పేర్కొంది.
యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐప్యాడ్, ఐపాడ్ టచ్, మ్యాక్, యాపిల్ టీవీ వంటివి కొనుగోలు చేసే వారికి నెలపాటు యాపిల్ టీవీ + సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభించనుంది.
ఇదీ చూడండి:హోల్‌సేల్ ధరలు తగ్గినా.. రిటైల్ రేట్లకు రెక్కలు ఎందుకు?