ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు మరోసారి సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చాయి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, గృహోపకరణాలు, గ్రోసరీ వంటి వాటిని భారీ తగ్గింపు ధరకు విక్రయించనున్నాయి కంపెనీలు.
అమెజాన్ ఆఫర్ పూర్తి వివరాలు..
అమెజాన్.. గ్రేట్ ఫ్రీడమ్ పెస్టివల్ పేరుతో సేల్ నిర్వహించనుంది. ఈ సేల్ ఆగస్టు 5 నుంచి 9 వరకు కొనసాగనుంది.
ఈ సేల్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా జరిపే లావాదేవీలపై (ఈఎంఐలకు కూడా) అదనంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందొచ్చని అమెజాన్ ప్రకటించింది. దీనితో పాటు అమెజాన్ పే ద్వారా సైన్ అప్ చేసుకున్న వారికి అదనంగా రూ.1000 వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
ప్రైమ్ యూజర్లు.. నో కాస్ట్ పరిమితి మూడు నెలలు అదనంగా పొందొచ్చని.. ఆరు నెలల వరకు శాంసంగ్, షియోమీ, ఐకూ వంటి ఫోన్లకు ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ వంటి ప్రత్యేక ఆఫర్లను పొందొచ్చని వెల్లడించింది అమెజాన్.
- స్మార్ట్ఫోన్ల, ఇతర యాక్సెసిరీస్లపై 40 శాతం వరకు డిస్కౌంట్
- కెమెరాలు, ట్రైపాడ్స్, రింగ్ లైట్స్, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్ వంటి వాటిపై 60 శాతం వరకు తగ్గింపు
- ల్యాప్‌టాప్‌లపై రూ.30 వేల వరకు, డెస్క్ టాప్‌లపై రూ.40 వేల వరకు తగ్గింపు.
- స్మార్ట్ వాచ్లుపై కూడా 60 శాతం వరకు డిస్కొంట్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్
అమెజాన్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ కూడా భారీ డిస్కౌంట్లతో మరోసారి బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రకటించింది. ఈ నెల 5 నుంచి 9 వరకు డిస్కౌంట్ సేల్ నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఈ సారి సేల్‌లో యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలు, ఈఎంఐలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందే వీలుంది.
ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ ప్రకారం.. ఎలక్రానిక్, యాక్సెసిరీస్లపై 80 శాతం వరకు, హెడ్‌ఫోన్స్, స్పీకర్లు, ట్యాబ్లెట్స్ వంటి వాటిపై 70 శాతం వరకు డిస్కౌంట్ ఉండనున్నట్లు తెలిసింది.
టీవీలు, ఇతర ఉపకరణాలపై 75 శాతం వరకు ఇవ్వనున్నట్లు పేర్కొంది ఫ్లిప్‌కార్ట్.
ఈ సారి సేల్‌లో.. 'క్రెజీ డీల్' కూడా ఉండనున్నట్లు తెలిసింది. సేల్ జరిగే రోజుల్లో అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 4 గంటలకు క్రెజీ డీల్ నిర్వహించనుంది ఫ్లిప్‌కార్ట్. దీనితో పాటు.. ఎంపిక చేసిన ఉత్పత్తులపై టిక్‌టాక్ డీల్ పేరిట పరిమిత కాల ఆఫర్ అందుబాటులోకి తేనుంది.
ఇవీ చదవండి: