ETV Bharat / business

పండుగ సేల్​కు ఫ్లిప్​కార్ట్, అమెజాన్ రెడీ.. ఆఫర్లు ఇవే..! - ఫ్లిప్​కార్ట్ పండుగ ఆఫర్లు

కొత్తగా ఫోన్లు, ల్యాప్​టాప్​లు, ఫ్రిడ్జ్​లు కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​ న్యూస్​. పండుగ సీజన్​ నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్​ (Amazon Great Indian Festival), ఫ్లిప్​కార్ట్​ (Flipkart Big billon days)​ స్పెషల్​ సేల్​కు సిద్ధమయ్యాయి. ఈ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

E-commerce ready for Festive sale
పండుగ సేల్​కు ఈ-కామర్స్ రేడీ
author img

By

Published : Sep 19, 2021, 2:03 PM IST

దేశీయ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్​, ప్లిప్​కార్ట్ మరో సారి భారీ సేల్​కు సిద్ధమయ్యాయి. ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా పండుగ సీజన్​ ఆఫర్లతో సేల్ నిర్వహించేందుకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్ (Amazon Great Indian Festival)​, ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్ డేస్ (Flipkart Big billon days)​ గురించి అధికారికంగా ప్రకటన చేశాయి.

అయితే ఈ సేల్స్​ తేదీలను ఇంకా ప్రకటించలేదు ఇరు సంస్థలు. అక్టోబర్ మొదటి వారం చివర్లో ఈ సేల్స్​ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సేల్​ తేదీ, ఆఫర్ల గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వనప్పటికీ పలు వివరాలను తెలిపాయి ఈ సంస్థలు.

ఆఫర్లు ఇలా!

అమెజాన్​..

ఈ సేల్​ కోసం హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​తో ఒప్పందం చేసుకున్నట్లు అమెజాన్​ వెల్లడించింది. హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​, డెబిట్​ కార్డ్​ ద్వారా జరిపే లావాదేవీలకు ఆఫర్​ డిస్కౌంట్​తో పాటు.. అదనంగా 10 శాతం క్యాష్​ బ్యాక్ (Amazon cash back offers)​ లభించనున్నట్లు తెలిపింది. అమెజాన్ పే ద్వారా చెల్లింపులు జరిపితే 5 శాతం క్యాష్​ బ్యాక్​ లభించనున్నట్లు పేర్కొంది.

ఈ సేల్​ (Amazon Great Indian Festival)లో ఎలక్ట్రానిక్స్​పై 40 శాతం వరకు డిస్కౌంట్​ లభించే అవకాశం ఉంది. మరిన్ని ఆఫర్లను త్వరలోనే ప్రకటించనుంది ఈ సంస్థ.

ఫ్లిప్​కార్ట్​

ఈ సారి సేల్​లో (Flipkart Big billon days) భారీ క్యాష్​ బ్యాక్స్​తో పాటు రివార్డ్స్​ కూడా ఇవ్వనున్నట్లు ఫ్లిప్​కార్ట్ ప్రకటించింది. యాక్సిస్​ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్​లు బ్యాంకింగ్​ భాగస్వాములుగా ఉన్నట్లు తెలిపింది. ఈ బ్యాంకుల క్రెడిట్​, డెబిట్​ కార్డులను ఉపయోగించి పేమెంట్​ చేసే వారికి బిగ్​ బిలియన్​ డేస్​ ఆఫర్ తోపాటు.. అదనపు డిస్కౌంట్ లభించనున్నట్లు తెలిపింది. పేటీఎం ద్వారా జరిపే చెల్లింపులకు కూడా డిస్కౌంట్​ ఉంటుందని వివరించింది.

ఎలక్ట్రానిక్స్​, గాడ్జెట్స్​పై ఈ సేల్​లో 80 శాతం వరకు డిస్కౌంట్​ (Flipkart offers on Gadgets) లభించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా టీవీలపై 70 శాతం వరకు, ఫ్రిడ్జ్​లపై 50 శాతం వరకు తగ్గింపు ఉండొచ్చని సమాచారం.

సేల్​ ప్రారంభమయ్యాక.. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఫ్లాష్​ సేల్ (Flipkart Flash sale) నిర్వహిస్తుంటుంది ఫ్లిప్​కార్ట్​. ఈ సారి కూడా ఈ ఆనవాయితీని కొనసాగించే వీలుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.