ETV Bharat / business

'రిపబ్లిక్‌ డే'కి ఈ-కామర్స్​ ఆఫర్ల సందడి - అమెజాన్​ ఆఫర్లు

అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ సంస్థలు పోటాపోటీ ఆఫర్లతో సందడి చేయనున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

Amazon and Flipkart will be announcing offers on the occasion of Republic Day
అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ పోటా పోటీ ఆఫర్లు
author img

By

Published : Jan 17, 2021, 7:22 PM IST

పండగలు, ప్రత్యేక రోజుల్లో కొనుగోలుదారుల కోసం ఆకట్టుకునే ఆఫర్లు ప్రకటించే ఈ-కామర్స్‌ సంస్థలు.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరోసారి ఆఫర్లు ప్రకటించాయి. 'గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌' పేరుతో అమెజాన్‌, 'బిగ్‌ సేవింగ్‌ డేస్'‌ పేరుతో ఫ్లిప్‌కార్ట్‌ మరో రెండ్రోజుల్లో అమ్మకాలు ప్రారంభించనున్నాయి.

అమెజాన్

జనవరి 20వ తేదీన ప్రారంభమయ్యే 'గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌' జనవరి 23న ముగుస్తుంది. అయితే, ప్రైమ్‌ చందాదారులకు ఒక్క రోజు ముందే అంటే.. 19వ తేదీనే ఈ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి కొనుగోలు చేసే వస్తువులపై పదిశాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. ఎకో స్మార్ట్‌ స్పీకర్స్‌, ఫైర్‌ టీవీ స్టిక్‌ డివైజ్‌లపై అమెజాన్‌ 40శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. రెడ్‌మీ 9ఏ ధర ₹9,499 ఉండగా.. ₹6,499కే లభించనుంది. టీవీ, వాషింగ్‌మిషన్‌ తదితర హోం అప్లియన్సెస్‌పై 60శాతం వరకు రాయితీ ఉంది.

వన్‌ప్లస్‌ 8టీ ఫోన్‌ను ₹40,499కే అమెజాన్‌ విక్రయించనుంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగ్‌ 865 ప్రాసెసర్‌ కలిగిన ఈ ఫోన్‌ 5జీని సపోర్ట్‌ చేస్తుంది. ప్రస్తుతం 69,900కి అమ్ముడవుతున్న ఐఫోన్‌ 12 మినీపై కూడా అమెజాన్‌ రాయితీ ఇవ్వనుంది. అయితే, రాయితీ ఎంతమేరకు అనే విషయంపై అమెజాన్‌ స్పష్టమైన ప్రకటన చేయలేదు. యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ ప్రో ఇయర్‌బడ్స్‌ ధర 24,900 ఉండగా.. 20,999కే అందుబాటులోకి రానుంది.

ఫ్లిప్‌కార్ట్‌

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ సేవింగ్‌ డేస్‌' జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డెబిట్‌/క్రెడిట్‌ కార్డులతో చేసిన కొనుగోళ్లకు పదిశాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసినా ఈ డిస్కౌంట్‌ వర్తిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ చందాదారులకు 19వ తేదీ నుంచే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. 'బిగ్‌ సేవింగ్‌ డేస్‌' ఆఫర్లలో భాగంగా ఐఫోన్‌ 11ను ₹50,299కు, మోటొరోలా మోటో జీ 5జీ ఫోన్‌ను ₹18,999కు ఫ్లిప్‌కార్ట్‌ విక్రయించనుంది. ఎలక్ట్రానిక్‌ అండ్‌ యాక్సెసరీస్‌ విభాగంలో 80శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. స్మార్ట్‌ టీవీ, అప్లియన్సెస్‌పై 75శాతం వరకు రాయితీ ఇవ్వడానికి ఫ్లిప్‌కార్ట్‌ సిద్ధమైంది.

ఇదీ చూడండి: ఇంధన వాడకం తగ్గినా.. వసూళ్లు పెరిగాయ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.