ETV Bharat / business

అమెజాన్‌ 'గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌' మరింత ముందుగానే! - బిగ్ బిలియన్ డేస్

'గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌'ను(Amazon Great Indian Festival 2021) అక్టోబరు 3 నుంచే ప్రారంభించబోతున్నట్లు అమెజాన్‌ ఇండియా ప్రకటించింది. మరోవైపు.. ఫ్లిప్​కార్ట్​ 'బిగ్ బిలియన్ డేస్'(Flipkart Big Billion Days 2021)​ విక్రయాలు కూడా అదే తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

Great Indian Festival
గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌
author img

By

Published : Sep 27, 2021, 5:36 AM IST

పండుగల సందర్భంగా రాయితీ విక్రయాలకు ఉద్దేశించిన గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌(జీఐఎఫ్‌)ను(Amazon Great Indian Festival 2021) అక్టోబరు 3 నుంచే ప్రారంభించబోతున్నట్లు అమెజాన్‌ ఇండియా ప్రకటించింది. ఇంతకుముందు ప్రకటించిన ప్రకారం అక్టోబరు 4 నుంచి జీఐఎఫ్‌(Amazon Great Indian Festival 2021) ప్రారంభించాల్సి ఉంది.

ఇదేవిధంగా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌(Flipkart Big Billion Days 2021) కూడా అక్టోబరు 7-12 తేదీలకు బదులు 3-10 తేదీల్లో జరగనుంది. గతేడాది పండుగ సీజన్‌లో ఇ-కామర్స్‌ దిగ్గజాల అమ్మకాలు 740 కోట్లుగా నమోదు కాగా, ఈ ఏడాది 900 కోట్ల డాలర్ల మేర జరగొచ్చని కన్సల్టింగ్‌ సంస్థ రెడ్‌సీర్‌ అంచనా వేసింది.

ఫ్లిప్​కార్ట్​లో రాయితీలు..

యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు, ఐసీఐసీఐ బ్యాంక్‌ డెబిట్‌ కార్డులతో కొనుగోళ్లపై 10శాతం వరకు 'బిగ్​ బిలియన్​ డేస్'​లో(Flipkart Big Billion Days 2021) విక్రయాల్లో రాయితీ లభిస్తుందని ఫ్లిప్​కార్ట్ ఇదివరకు​ తెలిపింది. అవసరమైన వస్తువులను ముందస్తుగా బుక్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. కిరాణా దుకాణాలకు రూ.8లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నట్లు సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి తెలిపారు.

బిగ్​ బిలియన్​ డేస్​లో భాగంగా ఈ సారి ఎన్నో కొత్త ఉత్పత్తులు, గేమ్స్​, లైవ్​ స్ట్రీమ్స్​ అందుబాటులో ఉంటాయని ఫ్లిప్​కార్ట్​ పేర్కొంది. డిసెంబరు నాటికి 4.2 లక్షల మంది విక్రయదారులే లక్ష్యంగా కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చింది.

అమెజాన్​లో డిస్కౌంట్లు..

జీఐఎఫ్‌ విక్రయాల​ కోసం హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​తో ఒప్పందం చేసుకున్నట్లు అమెజాన్​ ఇటీవల వెల్లడించింది. హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​, డెబిట్​ కార్డ్​ ద్వారా జరిపే లావాదేవీలకు ఆఫర్​ డిస్కౌంట్​తో పాటు.. అదనంగా 10 శాతం క్యాష్​ బ్యాక్ (Amazon cash back offers)​ లభించనున్నట్లు తెలిపింది. అమెజాన్ పే ద్వారా చెల్లింపులు జరిపితే 5 శాతం క్యాష్​ బ్యాక్​ లభించనున్నట్లు పేర్కొంది. ఈ సేల్​ (Amazon Great Indian Festival)లో ఎలక్ట్రానిక్స్​పై 40 శాతం వరకు డిస్కౌంట్​ లభించే ఉంది.

ఇదీ చూడండి: ఎలక్ట్రిక్​ వాహనం కొనాలా? అయితే మీకో గుడ్​ న్యూస్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.