కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. హ్యూస్టన్లో జరిగే హౌదీ మోదీ సభకు ముందు స్టాక్ మార్కెట్లను పరుగులు పెట్టించేందుకు ప్రధాని నరేంద్రమోదీ సిద్ధమయ్యారని... అందుకోసం రూ.1.4 లక్షల కోట్లు వృథా చేస్తున్నారని ఆరోపించారు.
"పెద్ద సభకు ముందు స్టాక్ మార్కెట్ల జోరును పెంచేందుకు ప్రధాని సిద్ధమవటం అద్భుతమే.
హ్యూస్టన్ కార్యక్రమం కోసం రూ.1.4 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్యక్రమం.
కానీ.. దేశంలో మోదీ సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని ఏ కార్యక్రమమూ దాచలేదు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోవటం, నిరుద్యోగ రేటు 45 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకోవటం వల్ల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. దేశీయ కంపెనీలకు 25.17 నుంచి 10 శాతానికి కార్పొరేటు పన్నును తగ్గిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో రూ.1.4 లక్షల కోట్లు ప్రభుత్వంపై భారం పడనుంది.
ఇదీ చూడండి: ఒక్క ప్రకటనతో రూ.2.11 లక్షల కోట్లకు పెరిగిన సంపద