ETV Bharat / business

ఆరోగ్య బీమాకూ ఉంది 'పోర్టబిలిటీ'..! - ఆరోగ్య బీమా

ఫోన్‌ నంబరు ఒక నెట్‌వర్క్‌ నుంచి మరో నెట్‌వర్క్‌కు మార్చటం సులభం. దీన్నే మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ అని అంటారు. అయితే ఆరోగ్య బీమాకు సంబంధించి కూడా పోర్టబిలిటీ అవకాశం ఉంది. ఇది ఎలా పనిచేస్తుంది? ఎప్పుడు పోర్ట్‌ చేసుకోవచ్చు? వంటి విషయాలను చూద్దాం...

All you need to know about insurance portability
ఆరోగ్య బీమాకూ ఉంది 'పోర్టబిలిటీ'..!
author img

By

Published : Aug 13, 2020, 3:13 PM IST

కొవిడ్‌ వల్ల బీమా ప్రాధాన్యం అందరికీ తెలిసింది. ఆరోగ్య బీమా అవసరమనే అంశాన్ని ప్రతి ఒక్కరికి కరోనా మహమ్మారి తెలియజేసింది. కొత్తగా వస్తోన్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని బీమా సంస్థలు ఎప్పటికప్పుడు పాలసీల్లో తగిన మార్పులు చేస్తున్నాయి. ఎక్కువ వ్యాధులకు బీమా అందించే విధంగా.. పాలసీ తీసుకోవాలనుకుంటే కొత్త పాలసీ కొనాల్సిన అవసరం లేకుండా.. ఉన్న ఆరోగ్య బీమా పాలసీని పోర్ట్‌ చేయించుకోవచ్చు.

2011లో ఆరోగ్య బీమా పాలసీ పోర్టబిలిటీకి భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) అనుమతి ఇచ్చింది. పోర్టబిలటీ ద్వారా పాలసీదారుడు ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాలసీని కొత్త దానికి లేదా వేరే బీమా సంస్థకు మార్చుకోవచ్చు.

ఎలా?

ఆరోగ్య బీమా పోర్టబిలిటీ కేవలం పాలసీ రిన్యూవల్‌ సమయంలోనే చేసుకోవాల్సి ఉంటుంది. పాలసీ మధ్యలో ఇది వీలు కాదు. పాలసీ గడువు ముగిసే కంటే 45 నుంచి 60 రోజుల మధ్య పోర్టబిలిటీ కావాలనుకుంటున్న వారు నూతన బీమా సంస్థను సంప్రదించాలి.

సేవలు సరిగా లేకపోవటం, చికిత్స సమయంలో వినియోగదారుడు భరించాల్సిన కో-పేమెంట్‌, వ్యాధికి సంబంధించిన చికిత్సకు ఉండే గరిష్ఠ పరిమితి లాంటి విషయాల్లో అంసతృప్తి.. కుటుంబసభ్యుల సంఖ్యలో మార్పు, కవరేజి పెంచుకోవాలనుకోవటం, క్యాష్‌లెస్‌ చికిత్స తదితర కారణాల వల్ల వినియోగదారులు పోర్టబిలిటీకి మొగ్గు చూపుతుంటారు. పోర్టబిలిటీ ప్రక్రియ ఇటీవలి కాలంలో సులభతరంగా మారిందని, ఆన్‌లైన్‌ ద్వారా తక్కువ పేపర్ వర్క్‌తో దీన్ని పూర్తి చేయవచ్చని బీమా ప్రతినిధులు చెబుతున్నారు.

"ఆరోగ్య బీమా పోర్టబిలిటీ చేయించుకోవాలనుకుంటున్న వారు రిన్యూవల్‌ కంటే 45 నుంచి 60 రోజుల ముందు కొత్త బీమా సంస్థను సంప్రదించాలి. అక్కడ పోర్టబిలిటీ దరఖాస్తు నింపి పాత పాలసీ వివరాలు అందించాలి. ప్రస్తుతం ఉన్న బీమా సంస్థలో కవరేజీ తక్కువుండటం, వేరే వాటి కంటే ఫీచర్లు తక్కువుండటం తదితర వాస్తవ కారణాలతో సంతృప్తిగా లేనట్లయితేనే పోర్టబిలిటీ తీసుకోవాలి" - నవల్‌ గోయల్‌, సీఈఓ, పాలసీ ఎక్స్‌.

సులభంగా పోర్టబిలిటీ...

వ్యక్తిగత, కుటుంబానికి సంబంధించిన బీమా పాలసీలకు పోర్టబిలిటీ అవకాశం ఉంది. పాత పాలసీలోని ప్రయోజనాలు దెబ్బతినకుండా.. పాలసీదారు బృంద బీమా నుంచి వ్యక్తిగత బీమాకు మార్చుకోవచ్చు. పోర్టింగ్‌ ద్వారా గత పాలసీలో ఉన్న ప్రయోజనాలు కొత్త దానికి బదిలీ చేసుకోవచ్చు. ఉచిత మెడికల్‌ చెక్‌అప్‌, క్లెయిమ్‌ లేకపోతే బోనస్‌ లాంటి సదుపాయాలను (కంటిన్యుటీ బెనిఫిట్స్‌) కూడా బదిలీ చేసుకునే వీలుంటుంది.

నూతనంగా వస్తోన్న ఆరోగ్య బీమా పాలసీలు సాధారణంగా విస్తృత కవరేజీ ఇస్తుంటాయని బీమా ప్రతినిధులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి సంబంధించి రివార్డు పాయింట్లు, ఆరోగ్యంగా ఉన్నందుకు అదనపు ప్రయోజనాలు, ఔట్‌ పేషెంట్‌ కవరేజీ, టెలిమెడిసిన్‌, కౌన్సిలింగ్‌ తదితర ప్రయోజనాలు ఇందులో ఉంటున్నాయని.. వీటిని పోర్టబిలిటీ ద్వారా పొందవచ్చని వారు అంటున్నారు.

వెయిటింగ్‌ పీరియడ్‌ కూడా మాఫీ…

ప్రస్తుత పాలసీలో వెయిటింగ్‌ పిరియడ్​ను పూర్తి చేసుకున్నట్లయితే.. కొత్త పాలసీలో వెయిటింగ్‌ పిరియడ్‌ మాఫీ అవుతుంది. వ్యాధులకు సంబంధించి ఉండే వెయిటింగ్‌ పిరియడ్‌ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. గత పాలసీలో ఉన్న నో- క్లెయిమ్ బోనస్‌ కూడా పోర్ట్‌ అవుతుంది. అయితే నో- క్లెయిమ్‌ బోనస్‌ జమవటంతో ఎక్కువ మొత్తాన్ని నూతన పాలసీకి పరిగణించటం వల్ల ప్రీమియం పెరుగుతుంది.

ఒకే రకంగా ఉండే పాలసీల మధ్య మాత్రమే పోర్టబిలిటీ జరుగుతుంది. ఉదాహరణగా సాధారణ ఆరోగ్య పాలసీని తీసుకుంటే… దాని నుంచి క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీకి మారరాదు. పాలసీదారు మెడిలక్‌ చెకప్‌ చేసుకోవాల్సి రావొచ్చు. పాలసీదారు ఎలాంటి విరామం లేకుండా గత పాలసీలో నాలుగు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కొనసాగినట్లైతే ఎలాంటి మెడికల్‌ చెకప్‌, హామీ లేకుండా పోర్ట్‌ కావొచ్చు. కొత్త ఆరోగ్య సమస్యలు, ఎక్కువ వయస్సు లాంటి కారణాలతో అదే బీమా మొత్తానికి ప్రీమియం పెరగవచ్చు.

ఇదీ చూడండి:- వాహనం నడిచిన దూరం బట్టి బీమా ప్రీమియం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.