ETV Bharat / business

మా యాప్​లో లావాదేవీలు సురక్షితమే: గూగుల్ పే

తమ యాప్​ ద్వారా చెల్లింపులు సురక్షితం కాదంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఖండించింది గూగుల్ పే. ఆర్​బీఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్​పీసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగానే లావాదేవీలు జరుగుతున్నట్లు స్పష్టం చేసింది.

google pay on transaction safety
లావాదేవీల భద్రతపై గూగుల్ పే
author img

By

Published : Jun 25, 2020, 11:38 AM IST

తమ యాప్​ ద్వారా చేసే అన్ని రకాల లావాదేవీలు పూర్తి సురక్షితంగా, ఆర్​బీఐ, ఎన్​పీసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగానే జరుగుతున్నట్లు గూగుల్ పే (జీపే) తెలిపింది. జీపే ద్వారా జరిగే లావాదేవీలకు రక్షణ లేదని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ స్పష్టతనిచ్చింది. యూజర్లకు ఏవైనా సమస్యలు ఉంటే వినియోగదారుల సేవా సిబ్బంది వారికి సహాయం చేసేందుకు 24/7 అందుబాటులో ఉంటారని వెల్లడించింది.

నగదు బదిలీ, చెల్లింపులకు సంబంధించి తాము బ్యాంకులతో కలిసి పనిచేస్తున్నామని, యూపీఐను ఉపయోగించుకొని తాము లావాదేవీలను పూర్తి చేస్తున్నామని పేర్కొంది జీపే. బ్యాంకులు యూపీఐ సేవలను వినియోగించుకునేందుకు తాము సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే అందిస్తున్నామని వివరించింది.

కోర్టులో కేసు..

ఈ యాప్‌ అనధికారికంగా దేశంలో నగదు బదిలీ సేవలను నిర్వహిస్తోందని పేర్కొంటూ ఇప్పటికే దిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇది గతవారం విచారణకు వచ్చిన సందర్భంగా యూపీఐ ఆధారంగా నగదు బదిలీ చేసే గూగుల్‌ పే యాప్‌ చెల్లింపుల వ్యవస్థ పరిధిలోకి రాదని ఆర్‌బీఐ హైకోర్టుకు తెలిపింది. నగదును ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు బదిలీ చేసే థర్డ్‌ పార్టీ యాప్‌ ప్రొవైడర్‌గానే పరిగణిస్తున్నట్లు చెప్పింది. జీపే ఎలాంటి చెల్లింపుల వ్యవస్థలో పాల్గొనడం లేదని, కేవలం నగదు బదిలీ చేసే థర్డ్‌ పార్టీ ఏజెంట్‌గానే వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా ఆర్‌బీఐ తెలిపింది. కాబట్టి, 'పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టం చట్టం 2007' ను జీపే ఉల్లంఘించినట్లు పరిగణించలేమని పేర్కొంది.

గత ఏడాది మార్చి 20న ఎన్‌పీసీఐ విడుదల చేసిన అధీకృత చెల్లింపుల నిర్వహణ సంస్థల జాబితాలో జీపే పేరు లేని విషయాన్ని పేర్కొంటూ.. ఆర్థికవేత్త అభిజిత్‌ మిశ్రా దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణను జులై 22కు కోర్టు వాయిదా వేసింది.

ఇదీ చూడండి:సుంకాల వివాదం లేకుండా చైనా దిగుమతులు ఆపొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.