భారతదేశం అంతటా 2,50,000 బ్యాంకింగ్ పాయింట్ల వద్ద ఆధార్-ఆధారిత పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్)ను ప్రారంభించినట్లు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ శుక్రవారం ప్రకటించింది. ఆధార్-అనుసంధానిత బ్యాంక్ ఖాతాలు ఉన్న ఏదైనా బ్యాంకు వినియోగదారులు ఇప్పుడు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభించిన బ్యాంకింగ్ పాయింట్ల వద్ద ఆర్థిక లావాదేవీలు చేయవచ్చు.
ఏఈపీఎస్, ప్రతి ఒక్కరికీ వారి ఆధార్‌ను మాత్రమే ఉపయోగించడం ద్వారా సురక్షితమైన బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది.
లావాదేవీలు సురక్షితం
ఆధార్-లింక్డ్ బ్యాంక్ ఖాతాను అనుమతించేందుకు వారి ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడీని ఉపయోగించి మైక్రో ఏటీఎమ్‌లో ఉపసంహరణలు, బ్యాలెన్స్ ఎంక్వైరీలు, మినీ-స్టేట్‌మెంట్‌లు వంటి ఆర్థిక లావాదేవీలను నిర్వహించడానికి ఏఈపీఎస్ వినియోగదారులను అనుమతిస్తుంది. ఆధార్ నంబర్, వేలిముద్ర రికార్డులతో సరిపోలితే మాత్రమే లావాదేవీలు ప్రామాణీకరిస్తుంది.
ఇది బ్యాంకింగ్ ప్రక్రియల భద్రతను మరింత పెంచుతుందని ఎయిర్‌టెల్ తెలిపింది, ఎందుకంటే వినియోగదారులు తమ బ్యాంకింగ్ లావాదేవీలను కేవలం వారి ఆధార్ నంబర్‌తో తమ బ్యాంకు ఖాతా లేదా డెబిట్ కార్డు వివరాలను ఎవరికీ వెల్లడించకుండా పూర్తి చేస్తారు.
ఇదీ చూడండి: ఏడేళ్లుగా కొనసాగుతన్న వృద్ధి క్షీణతను తగ్గించాం: ఎఫ్ఎమ్