ETV Bharat / business

ఎయిర్​టెల్​ సేవలకు బ్రేక్- సోషల్​ మీడియాలో ఫిర్యాదులు

Airtel Outage: భారతీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్​టెల్​ సేవలకు దేశవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎయిర్​టెల్​ నెట్‌వర్క్‌ అంతరాయంపై ట్విట్టర్​ వేదికగా ఫిర్యాదు చేశారు.

Airtel Down
Airtel Down
author img

By

Published : Feb 11, 2022, 2:08 PM IST

Airtel Down: భారత్​లో ఎయిర్‌టెల్​ సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపం వల్ల వినియోగదారులు ఇబ్బంది పడినట్లు ఆ సంస్థ​ ధ్రువీకరించింది. అయితే కొద్దిసేపటికే సమస్యను పరిష్కరించినట్లు తెలిపింది. దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా అనేక ప్రధాన నగరాల్లో ఉదయం 11 గంటల సమయంలో తలెత్తిన ఈ సమస్య టెలికాం నెట్‌వర్క్‌లోని బ్రాడ్‌బ్యాండ్, సెల్యులార్ వినియోగదారులపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

'అసౌకర్యానికి చింతిస్తున్నాం'

ఈ సమస్యను పరిష్కరించి.. కొద్దిసేపటికే సేవలు పునరుద్ధరించినట్లు ఎయిర్​టెల్​ ప్రతినిధి ఒకరు తెలిపారు. "సాంకేతిక లోపం వల్ల ఇంటర్నెట్​ సేవలకు అంతరాయం ఏర్పడింది. అయితే స్వల్ప వ్యవధిలోనే సమస్యను పరిష్కరించి.. సేవలను పునరుద్ధరించాం. వినియోగదారుల అసౌకర్యానికి చింతిస్తున్నాం" అని ఎయిర్​టెల్​ ప్రతినిధి పేర్కొన్నారు.

అప్పటికే ఎయిర్​టెల్​ వినియోగదారులు.. ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులు చేశారు. ఎయిర్​టెల్​ ఇంటర్నెట్​ సేవలు, మొబైల్​ నెట్​వర్క్​, ఎయిర్​టెల్​ యాప్​ సహా కస్టమర్​ కేర్​కు కూడా ఫోన్​ కలవలేదని 'ఎయిర్​టెల్​డౌన్​' అనే హ్యాష్​ ట్యాగ్​తో ట్వీట్లు​ చేశారు.

ఇదీ చూడండి: మార్కెట్లపై అమెరికా ద్రవ్యోల్బణం దెబ్బ.. రూ.3.39 లక్షల కోట్లు ఆవిరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.