టెలికాం దిగ్గజం ఎయిర్టెల్(airtel recharge).. ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచుతునున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్, అన్లిమిటెడ్ వాయిస్ ప్యాక్‌లు, మొబైల్ డేటా రీఛార్జ్‌లపై ఉన్న ధరలపై 20-25 శాతం పెంచినట్లు తెలిపింది. ఎంట్రీ లెవెల్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర 25శాతం.. అన్లిమిటెడ్ వాయిస్ బండిల్స్ ధర 20శాతం పెంచినట్లు పేర్కొంది. కొత్త ధరలు నవంబరు 26 నుంచి అమల్లోకి రానున్నట్లు వివరించింది.
నూతన ధరలు.. దేశంలో 5జీ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడతాయని ఎయిర్టెల్ పేర్కొంది. కొత్త రేట్ల ప్రకారం.. వాయిస్ ప్లాన్స్ ధర ఇంతకుముందు రూ.79 కాగా ప్రస్తుతం రూ. 99కు చేరింది. 50శాతం అధిక టాక్‌టైం, 200జీబీ మొబైల్ డేటా, సెకనుకు 1పైసా వాయిస్ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ప్లాన్ గడువు 28 రోజులు ఉంది.
మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ ద్వారా.. ఒక్కో యూజర్ నుంచి సరాసరి రెవెన్యూ(ఏఆర్పీయూ) రూ. 200 నుంచి రూ. 300 వరకు ఎయిర్‌టెల్‌కు(airtel recharge) చేరుతున్నట్లు కంపెనీ తెలిపింది. అన్లిమిటెడ్ వాయిస్ బండిల్స్, డేటా టాప్అప్స్పైనా రీఛార్జ్ ధరలు పెరిగినట్లు ఎయిర్టెల్ పేర్కొంది.
ఇదీ చూడండి: గూగుల్ పేలో కొత్త ఫీచర్.. వాయిస్‌తో పేమెంట్!