ETV Bharat / business

ఎయిర్​టెల్​కే అధికంగా కొత్త యూజర్లు!

author img

By

Published : Jan 29, 2021, 5:35 AM IST

ఎయిర్​టెల్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాది నవంబర్​లో కొత్తగా 43.7 లక్షల మంది యూజర్లు జతయ్యారు. దీంతో మొత్తం ఎయిర్​టెల్​ సబ్​స్క్రైబర్ల సంఖ్య 33.46 కోట్లకు పెరిగింది. జియో యూజర్ల సంఖ్య 19.36 లక్షల మంది పెరిగి.. 40.82 కోట్లకు చేరింది. ఈ సమయంలో వొడాఫోన్ ఐడియా తన వినియోగదారులను కోల్పోయింది.

airtel-adds-43-dot-7-lakh-users-in-nov-voda-idea-loses-subscribers-trai-data
ఎయిర్​టెల్​కే అధికంగా కొత్త యూజర్లు!

2020 నవంబర్​ నెలలో ఎయిర్​టెల్​కు భారీ సంఖ్యలో కొత్త వినియోగదారులు వచ్చి చేరారు. దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా ఆవిర్భవించిన జియోతో పోలిస్తే ఎక్కువగా కొత్త యూజర్లు జతయ్యారు.

ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం నవంబర్​లో 43.7 లక్షల మంది చందాదారులు ఎయిర్​టెల్​ సభ్యత్వం తీసుకున్నారు. దీంతో సంస్థ యూజర్ల సంఖ్య 33.46 కోట్లకు పెరిగింది. అదేసమయంలో 19.36 లక్షల మంది వినియోగదారులు జియోలోకి చేరారు. వీరితో కలిపి జియో వినియోగదారుల సంఖ్య 40.82 కోట్లకు చేరింది. మరోవైపు, నవంబర్​లో వొడాఫోన్ ఐడియా 28.9 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది. కంపెనీ యూజర్ బేస్ 28.99 కోట్లకు పరిమితమైంది.

2020 నవంబర్ చివరి నాటికి భారత్​లో టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 117.53 కోట్లకు చేరిందని ట్రాయ్ తెలిపింది. ఇందులో పట్టణ వినియోగదారులు 64.86 కోట్లు, గ్రామీణ వినియోగదారులు 52.67 కోట్ల మంది ఉన్నారని వెల్లడించింది. మొత్తం వైర్​లెస్ టెలికాం వినియోగదారు(115.52 కోట్లు)ల్లో 83.83 శాతం(96.84 కోట్లు) మంది యాక్టివ్​గా ఉన్నారని పేర్కొంది. ఈ జాబితాలో ఎయిర్​టెల్​కు ఎక్కువ(96.63 శాతం) మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

బ్రాడ్​బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లలో రిలయన్స్​కు 41 కోట్లు, ఎయిర్​టెల్​కు 17.45 కోట్లు, వొడాఫోన్ ఐడియాకు 12.1 కోట్లు, బీఎస్ఎన్ఎల్​కు 2.61 కోట్ల మంది సబ్​స్క్రైబర్లు ఉండగా... మొత్తం వినియోగదారుల్లో ఈ ఐదు సంస్థలకు చెందినవారే 98.84 శాతం మంది ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.