ETV Bharat / business

లాక్​డౌన్​పై ఆ 5 విమానాల చాటింగ్​ అదుర్స్ - హైదరాబాద్​, బెంగళూరు విమానాశ్రయాలు

ఇండిగో, ఎయిర్ విస్తారా, గోఎయిర్​, ఎయిర్​ ఏషియా, స్పైస్​ జెట్... అన్నీ దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థలు. వ్యాపారపరంగా ప్రత్యర్థులు. ఇప్పుడు అన్ని సంస్థలదీ ఒకే పరిస్థితి. లాక్​డౌన్​తో ఆకాశవీధుల్ని వదిలి.. విమానాలన్నీ ఎయిర్​పోర్టులకే పరిమితమయ్యాయి. ఇలాంటి ఖాళీ సమయంలో కాసేపు సరదాగా మాట్లాడుకున్నాయి ఆ విమానయాన సంస్థలు.

Airlines engage in banter online amid coronavirus gloom
కరోనాపై ట్విట్టర్​లో విమానయాన సంస్థల ఆసక్తికర సంభాషణ
author img

By

Published : Apr 11, 2020, 11:10 AM IST

Updated : Apr 11, 2020, 12:24 PM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో విమానయాన సంస్థలు తమ సేవలను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రముఖ విమానయాన సంస్థలన్నీ లాక్​డౌన్​పై ట్విట్టర్​ వేదికగా ఆసక్తికర సంభాషణ జరిపాయి. తమ భావాలను పరస్పరం పంచుకుంటూ.. ప్రస్తుత పరిస్థితుల్లో గగనతలంలో ఎగరడం కంటే నేలపై ఉండటమే మంచిదని ముక్తకంఠంగా స్పష్టం చేశాయి.

ఈ ఆసక్తికర ట్విట్టర్​ సంభాషణను మొదట ప్రారంభించింది ఇండిగో. ఎయిర్ ​విస్తారాను ట్యాగ్​ చేస్తూ.. "హే ఎయిర్​ విస్తారా, ప్రస్తుతం మీరు విమాన సర్వీసులు నడపట్లేదని విన్నాం?" అని ట్వీట్​ చేసింది. అలాగే స్టేయింగ్​ పార్క్​డ్​స్టేయింగ్​ సేఫ్​, లెట్స్​ఇండియాగో అనే హ్యాష్​ట్యాగ్​లు జోడించింది.

airlines
ఇండిగో ట్వీట్​తో మొదలు...

ఇండిగో​ ట్వీట్​కు స్పందించిన ఎయిర్​ విస్తారా.. "లేదు ఇండిగో, ఈ రోజుల్లో సర్వీసులను ఆపేసి విమానాలను నేలపై ఉంచడమే ఉత్తమమైన పని. ప్రస్తుతం సర్వీసులు కొనసాగించడమనేది తెలివైన ఎంపిక కాదు. గోఎయిర్​... నువ్వు ఏమంటావ్​?" అంటూ ప్రశ్నించింది.

airlines
ఇండిగోకు విస్తారా రిప్లై
airlines
ఎయిర్​ ఏషియాకు గోఎయిర్​ ప్రశ్న

విస్తారా ట్వీట్​కు స్పందించిన గోఎయిర్​.. "వందశాతం, విస్తారా! ఇంట్లో ఉండడం సురక్షితమైనది! అందరూ ఆకాశవీధుల్లో విహరించేంతవరకు మనం వేచి చూడగలం. ఎందుకంటే ప్రస్తుతం అందరూ ఎగరగలిగే పరిస్థితులు లేవు. నిజమేనా ఎయిర్​ఏషియా?" అంటూ ఎయిర్​ఏషియాను ప్రశ్నించింది.

గోఎయిర్​ఇండియా, విస్తారా ట్వీట్లకు స్పందిస్తూ.. "కచ్చితంగా గోఎయిర్​. ప్రస్తుతానికి ఇంట్లో ఉండడమనేది రెడ్​, హాట్​, స్పైసీ అంశం." అని బదులిచ్చింది ఎయిర్​ఏషియా. అలాగే స్పైస్​జెట్​ను ట్యాగ్​చేస్తూ.. ఇది నిజం కాదా? అని ప్రశ్నించింది.

airlines
స్పైస్​జెట్​ను సంభాషణలోకి లాగిన ఎయిర్​ ఏషియా
airlines
ఎయిర్ ఏషియాతో స్సైస్​జెట్​ స్నేహగీతం

ఆ తర్వాత ఎయిర్​ఏషియా ట్వీట్​కు స్పందించిన స్పైస్​జెట్​.. "మన రంగుల మాదిరే ఆలోచనలు కూడా కలిశాయి." అని ట్వీట్​ చేసింది. అనంతరం ఈ సంభాషణలోకి దిల్లీ ఎయిర్​పోర్టునూ ట్యాగ్​ చేసింది స్పైస్​జెట్​.

ఈ ట్వీట్లకు తమదైన రీతిలో స్పందించారు దిల్లీ విమానాశ్రయం అధికారులు. మొత్తం నాలుగు విమానయాన సంస్థలను ట్యాగ్​ చేస్తూ.. "అతి త్వరలో భారత ఆకాశవీధులు మీ రంగులతో నిండుతాయి." అని ట్వీట్​ చేశారు.

హైదరాబాద్​, బెంగళూరు విమానాశ్రయాలు కూడా ట్వీట్ల సంవాదంలో భాగమయ్యాయి. అన్ని విమానయాన సంస్థలతో పాటు ఎయిర్​పోర్ట్​ అధికారులు కూడా.. స్టేయింగ్​పార్క్​డ్​స్టేయింగ్​సేఫ్​ అనే హ్యాష్​ట్యాగ్​ను జోడించారు.

airlines
దిల్లీ ఎయిర్​పోర్ట్ ఐక్యతా రాగం

Last Updated : Apr 11, 2020, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.