ETV Bharat / business

విదేశీ ప్రయాణికులకు షాక్​-  భారీగా పెరిగిన టికెట్​ ధరలు

author img

By

Published : Aug 8, 2021, 7:50 PM IST

భారత్​ నుంచి విదేశాలకు వెళ్లే విమానాల్లో ఎకానమీ టికెట్టు ధరలు జులైతో పోలిస్తే ఆగస్టు నెలలో భారీగా పెరిగాయని ఈస్​మైట్రిప్​.కామ్ తెలిపింది. విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య పెరగడం వల్లే ధరలు పెరిగాయని చెప్పింది.

Airfares
విమాన ఛార్జీలు

భారత్​ నుంచి విదేశాలకు వెళ్లే విమాన ధరలకు రెక్కలొచ్చాయి. జులైతో పోలిస్తే ఆగస్టు నాటికి ఎకానమీ తరగతి టికెట్టు ధరలు గణనీయంగా పెరిగాయని ఈస్​మైట్రిప్​.కామ్​ తెలిపింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరిగినందునే ధరల్లో ఈ పెరుగుదలకు కారణం అని చెప్పింది.

ఈజ్​మైట్రిప్​.కామ్​ డేటా ప్రకారం..

  • దిల్లీ నుంచి అమెరికాలోని నేవార్క్​కు వెళ్లే.. ఎకానమీ తరగతి విమానాల ధర.. జులైలో ఉండగా రూ.69,034 ఉండగా.. ఆగస్టులో రూ.87,542కు చేరింది.
  • జులై నెలలో ముంబయి-మాస్కోకు వెళ్లే ఎకానమీ తరగతి టికెట్టు రూ.43,132గా ఉండగా.. ముంబయి- దోహ టికెట్టు ధర రూ.11,719గా ఉంది. అయితే ఈ ధరలు ఆగస్టు నాటికి క్రమంగా రూ.85,024, రూ.18,384కు చేరాయి.

జులై పోల్చితే ఆగస్టులో సగటు ఎకానమీ టికెట్టు తరగతుల ధరలు భారీగా పెరిగాయని ఈస్​మైట్రిప్​ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు నిషాంత్​ పిట్టి తెలిపారు.

"ఇటీవల అనేక దేశాలు తమ ప్రయాణ నిబంధనలను సడలించాయి. దాంతో విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య పెరిగింది. ఇంధన ధరలు పెరగడం, సీట్ల కొరత వంటివి.. ఈ మార్గాల్లో విమాన ధరలు పెరగడానికి మరో కారణం. భారత్​లో వ్యాక్సినేషన్​ డ్రైవ్​ పూర్తైతే విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నాం."

-నిశాంత్​ పిట్టి, ఈస్​మైట్రిప్​.కామ్​ సీఈఓ.

మరోవైపు.. భారత్​- బ్రిటన్ మధ్య మార్గాల్లో విమాన ధరలు పెరగడంపై ప్రయాణికులు... సామాజిక మాధ్యమాల్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

'నివేదిక సమర్పించండి'

ఆగస్టు నెలలో భారత్​ నుంచి బ్రిటన్​కు వెళ్లేందుకు వసూలు చేస్తున్న విమాన ఛార్జీల వివరాలను తమకు సమర్పించాలని అన్ని విమానయాన సంస్థలను డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశించింది. ఈ మేరకు ఓ సీనియర్ అధికారి తెలిపారు.

ఆగస్టు 26న దిల్లీ నుంచి లండన్​కు వెళ్లే బ్రిటన్ విమానాల్లో ఎకానమీ టికెట్​ ధర..రూ.3.95 లక్షలుగా ఉందని ట్విట్టర్ వేదికగా ఇంటర్​-స్టేట్​ కౌన్సిల్​ కార్యదర్శి సంజీవ్​ గుప్తా తెలిపారు. విస్తారా, ఎయిర్ ఇండియాలో ఈ ధర రూ.1.2 లక్షల నుంచి రూ.2.3 లక్షల మధ్య ఉందని చెప్పారు. దీనిపై దృష్టి సారించాల్సిందిగా కేంద్ర పౌర విమానాయాన శాఖ కార్యదర్శి పీఎస్​ ఖరోలియాను తాను కోరానని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఆకాశ ఎయిర్‌.. బోయింగ్‌కు కలిసొచ్చేనా?

ఇదీ చూడండి: క్యూ1 ఫలితాలే మార్కెట్లకు కీలకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.