ETV Bharat / business

విమానాల్లో ఇక వాటినీ తీసుకెళ్లొచ్చు!

కరోనా వైరస్​ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో విమాన ప్రయాణికులు హ్యాండ్​ శానిటైజర్లు తీసుకెళ్లేందుకు అధికారులు అనుమతిచ్చారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది బ్యూరో ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​ సెక్యూరిటీ(బీసీఏఎస్​). ఈ ఆదేశాలు 2020 మే 13 నుంచి మూడు నెలలు వరకే అమల్లో ఉంటాయని తెలిపారు.

Air passengers can now carry hand sanitisers in hand baggage
విమానాల్లోనూ హ్యాండ్​ శానిటైజర్లు తీసుకెళ్లొచ్చు
author img

By

Published : May 15, 2020, 3:31 PM IST

లాక్​డౌన్​ సడలింపులతో విమాన ప్రయాణాలు త్వరలో పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమతో పాటు హ్యాండ్​ శానిటైజర్లు తీసుకెళ్లేందుకు అధికారులు అనుమతించనున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది బ్యూరో ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​ సెక్యూరిటీ(బీసీఏఎస్​). ఈ ఉత్తర్వులు 2020 మే 13 నుంచి మూడు నెలలు వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

"తరచూ శానిటైజర్లలతో చేతులు శుభ్రం చేసుకోవడం వైరస్​ను ఎదుర్కొనే చర్యల్లో ఒకటి. విమానాల్లో ప్రయాణించేవారు తమతో పాటు 350 మిల్లీలీటర్లు హ్యాండ్​ శానిటైజర్లు తీసుకెళ్లేందుకు బీసీఏఎస్ అనుమతిస్తుంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. అయితే ఇతర లిక్విడ్​లు, పేస్ట్​లు 100 మీల్లీలీటర్లుకు మంచి నిషేధం."

-ఎయిర్​ పోర్టు అథారిటీ ఆఫ్​ ఇండియా

ముందే చెప్పండి

భద్రతా తనిఖీ సమయాల్లో వారికి సహకరించి శానిటైజర్లు ఉన్నట్లు తెలపాలని ప్రయాణికులకు అధికారులు సూచించారు. విమానాశ్రయాల్లో విమానం ఎక్కే ముందు చేసిన తనిఖీల్లో ప్రయాణికుల పాస్​లపై సీఐఎస్​ఎఫ్​ సిబ్బంది ఎటువంటి స్టాంప్​ వేయరని వెల్లడించారు.

ఇదీ చూడండి: కరోనా ప్యాకేజీలో కౌలు రైతుల ఊసేది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.