ETV Bharat / business

త్వరలోనే టాటా గ్రూప్​ చేతికి ఎయిర్​ఇండియా!

author img

By

Published : Jan 24, 2022, 6:31 PM IST

Updated : Jan 24, 2022, 8:57 PM IST

Air India TATA: ఎయిర్​ఇండియా అతి త్వరలోనే పూర్తిగా టాటాల కంపెనీగా మారనుంది. ఈ విమానయాన సంస్థ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం ఈ వారాంతం నాటికి టాటా గ్రూప్‌నకు అప్పగించనున్నట్లు ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి.

air-india-handover-to-tata-group-process-will-complete-soon
త్వరలోనే టాటా గ్రూప్​ చేతిలోకి ఎయిర్​ఇండియా!

Air India TATA: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్​ఇండియాలో 100 శాతం వాటాలు పొందేందుకు 18 వేల కోట్లతో టాటాలకు చెందిన ప్రత్యేక సంస్థ టాలెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ దాఖలు చేసిన బిడ్‌కు గతేడాది అక్టోబరు 8న కేంద్రం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అదే నెల 11న ఈ బిడ్డింగ్‌ను ధ్రువీకరిస్తూ కేంద్రం లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ను జారీ చేసింది. అక్టోబరు 25న, ఈ ఒప్పందానికి సంబంధించిన షేర్‌ పర్చేస్‌ అగ్రిమెంట్‌పై ప్రభుత్వం సంతకం చేసింది. ఇక మిగతా ప్రక్రియ కూడా రెండు, మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అవి పూర్తయిన వెంటనే ఈ వారాంతం నాటికి ఎయిర్​ఇండియాను పూర్తిగా టాటాల చేతుల్లో పెట్టనున్నట్లు తెలిపాయి.

ఎయిర్​ఇండియా ఫైనాన్స్‌ డైరెక్టర్‌ వినోద్‌ హెజ్మాది కూడా ఇదే విషయాన్ని సంస్థ సిబ్బందికి ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేసినట్లు సమాచారం. జనవరి 27 నుంచి ఎయిర్​ఇండియా నిర్వహణ టాటాలు అందుకోనున్నట్లు ఆయన తన మెయిల్‌లో పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఎయిర్​ఇండియాతో పాటు ప్రధాన విమానాశ్రయాల్లో కార్గో, గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సేవలను అందించే ఎయిర్​ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం, ఐఏఎస్‌ఏటీఎస్‌లో 50 శాతం టాటా గ్రూప్‌నకు దక్కనుంది. ఎయిర్​ఇండియా రాకతో టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోకి మూడో విమానయాన బ్రాండ్‌ వచ్చినట్లవుతుంది. ఇప్పటికే విస్తారా, ఎయిరేషియా ఇండియాలో టాటాలకు మెజారిటీ వాటాలున్నాయి. ఎయిర్​ఇండియా నిర్వహణ బాధ్యతలు వచ్చిన తర్వాత ఎయిరేషియా ఇండియా, ఎయిర్​ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను విలీనం చేయాలని టాటా గ్రూప్‌ యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక సమాచారం లేదు.

ఈ ఒప్పందంతో దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత మళ్లీ పూర్తిగా టాటా గ్రూప్‌ అధీనంలోకి ఎయిర్​ఇండియా వెళ్లనుంది. 89ఏళ్ల కిందట 1932లో జేఆర్‌డీ టాటా.. టాటా ఎయిర్‌ సర్వీసెస్‌ స్థాపించారు. ఆ తర్వాత అది ఎయిర్​ఇండియా మారింది. 1953లో దీన్ని జాతీయకరణ చేయడంతో ఎయిర్​ఇండియా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. ప్రైవేటు సంస్థలను విమానయాన రంగంలోకి అనుమతించాక ఎయిర్​ఇండియా క్రమంగా తన ప్రభ కోల్పోసాగింది. 2007-08లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌తో విలీనం అనంతరం సంస్థకు నష్టాలు మొదలయ్యాయి. ఫలితంగా అప్పులు పెరిగాయి. దీంతో ప్రభుత్వం ప్రైవేటీకరణ బాటపట్టింది. ఈ క్రమంలో ఎయిర్​ఇండియా తిరిగి టాటాలు దక్కించుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: 'స్టాక్​ మార్కెట్ల పతనం తాత్కాలికమే.. మళ్లీ ఎప్పుడు పుంజుకుంటాయంటే..'

Last Updated : Jan 24, 2022, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.