ETV Bharat / business

అఫ్గాన్​పై తాలిబన్ల పట్టు- భారత్​తో వాణిజ్యం పరిస్థితేంటి?

అఫ్గానిస్థాన్​లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం.. భారత్​పై వాణిజ్య పరంగా తీవ్రంగా ఉండనున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. ఇరు దేశాల మధ్య మొన్నటి వరకు ఉన్న సత్సంబంధాల వల్ల భారతీయ ఉత్పత్తులకు.. అఫ్గాన్​లో మంచి డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

author img

By

Published : Aug 16, 2021, 4:24 PM IST

Afghan impact on Exports
ఎగుమతులపై అప్గాన్​ దెబ్బ

రెండు దశాబ్దాల ప్రజాస్వామ్య పాలనను కూలదోసి.. అఫ్గాన్​ను తాలిబన్​​లు చేజిక్కించుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు తాలిబన్లు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుత అస్థిర పరిస్థితులతో భారత్- అఫ్గాన్​ ద్వైపాక్షిక వాణిజ్యం తీవ్రంగా ప్రభావితం కానున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అఫ్గాన్​లో రాజకీయ పరిణామాలను గమనిస్తూ.. దేశీయ ఎగుమతిదారులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ఫెడరేషన్​ ఎక్స్​పోర్ట్స్​ ఆర్గనైజేషన్(ఎఫ్​ఐఈఓ) డైరెక్టర్​ జనరల్​ అజయ్​ సాహీ సూచించారు. ముఖ్యంగా చెల్లింపుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

భారత్​-అఫ్గాన్ వాణిజ్యం భారీగా పడిపోతుందని ఎఫ్​ఐఈఓ మాజీ అధ్యక్షుడు ఎస్​.కె.సరఫ్​ పేర్కొన్నారు. అయితే ఇరు దేశాల మధ్య వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయే అవకాశం లేదన్నారు . వారికి మన ఉత్పత్తుల అవసరం ఉండటం ఇందుకు కారణం స్పష్టం చేశారు.

ఇరు దేశాల వాణిజ్యం ఇలా..

2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్​-అఫ్గాన్​ దైపాక్షిక వాణిజ్యం 1.4 బిలియన్​ డాలర్లుగా నమోదైంది. ఈ సమయంలో భారత్ అఫ్గాన్​కు​ 826 మిలియన్​ డాలర్ల విలువైన ఎగుమతులు చేసింది. అఫ్గాన్​ నుంచి 510 మిలియన్​ డాలర్ల విలువైన దిగుమతులు చేసుకుంది. 2019-20లో ఇరు దేశాల మధ్య ఎగుమతి దిగుమతుల విలువ 1.52 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

అఫ్గానిస్థాన్​ నుంచి భారత్ అత్యధికంగా.. ఎండు ద్రాక్షలు, వాల్నట్​, బాదాం, అంజీర, పైన్​ నట్​, పిస్తా సహా పలు రకాల డ్రైఫ్రూట్స్​, చెర్రీ, పుచ్చకాయలు, ఔషధ మూలికలను దిగుమతి చేసుకుంటుంది. భారత్​ నుంచి అఫ్గానిస్థాన్​కు తేయాకు, కాఫీ, మిరియాలు, కాటన్​ వంటివి అధికంగా ఎగుమతవుతుంటాయి.

ఇదీ చదవండి: 'అప్పటికల్లా రూ.75లక్షల కోట్లకు ఎగుమతులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.