ETV Bharat / business

అమెరికా నిర్ణయంతో టీకా ఉత్పత్తికి ఇబ్బందులు! - పూనావాలా

టీకా ముడి పదార్థాల ఎగుమతిపై అమెరికా తాత్కాలిక నిషేధం విధించడం సరికాదని వ్యాక్సిన్​ తయారీ సంస్థలు తెలిపాయి. వ్యాక్సిన్​ తయారీని వేగవంతం చేసే ప్రక్రియలో ఈ అవరోధాలను తొలగించాల్సి ఉందని అభిప్రాయపడ్డాయి. అమెరికా నిర్ణయం వల్ల భారీ స్థాయిలో నోవావాక్స్‌ వ్యాక్సిన్‌ తయారీకి సిద్ధమైనప్పటికీ తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయని సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా పేర్కొన్నారు.

adar-poonawalla-warns-us-over-vaccine-material-shortage
అమెరికా నిర్ణయంతో టీకా ఉత్పత్తికి ఇబ్బందులు!
author img

By

Published : Mar 6, 2021, 5:31 AM IST

వ్యాక్సిన్‌ తయారీకి కావాల్సిన కీలక ముడి పదార్థాల ఎగుమతులపై అమెరికా తాత్కాలిక నిషేధం విధించడంతో టీకా ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని భారత వ్యాక్సిన్‌ సంస్థలు వెల్లడించాయి. వ్యాక్సిన్‌ తయారీని వేగవంతం చేసే ప్రక్రియలో ఈ అవరోధాలను తొలగించాల్సి ఉందని అభిప్రాయపడ్డాయి. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ ఎంతో కీలకంగా మారిన నేపథ్యంలో ముడి పదార్థాల ఎగుమతులపై అమెరికా నిషేధం విధించడాన్ని తప్పుబడుతున్నాయి.

'వ్యాక్సిన్‌కు అవసరమైన బ్యాగులు, ఫిల్టర్లతో పాటు పలు కీలక వస్తువులపై అమెరికా తాత్కాలిక నిషేధం విధించింది. దీంతో భారీ స్థాయిలో నోవావాక్స్‌ వ్యాక్సిన్‌ తయారీకి సిద్ధమైనప్పటికీ తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి' అని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదర్‌ పూనావాలా పేర్కొన్నారు. అమెరికా సంస్థలకు ప్రయోజనం కలిగించేందుకు వీలుగా ఈ మధ్యే అమెరికా డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ యాక్ట్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. దీంతో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ సమపాళ్లలో అందించాలన్న లక్ష్యానికి ఆటకం ఏర్పడిందన్నారు. ఇలా వ్యాక్సిన్‌ తయారీకి ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ గడిచిన రెండు నెలల్లో భారీ స్థాయిలో వ్యాక్సిన్‌ విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ స్పష్టంచేశారు. ఇప్పటివరకు 51 దేశాలకు దాదాపు 9కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపించామని తెలిపారు.

వ్యాక్సిన్‌ తయారీకి కావాల్సిన ముడిపదార్థాల కొరతపై ప్రపంచ ఆరోగ్యసంస్థ నిపుణురాలు సౌమ్య స్వామినాథన్‌ స్పందించారు. ఇలాంటి కీలక సమయంలో ఎగుమతులపై నిషేధాలు విధించకుండా ప్రపంచ దేశాలతో సమన్వయం, ఒప్పందాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఇదిలాఉంటే, అమెరికాలో భారీ స్థాయిలో పంపిణీ చేస్తోన్న ఫైజర్‌ టీకా కోసమే అమెరికా ముడిపదార్థాల ఎగుమతిపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: ముత్తూట్​ గ్రూప్ ఛైర్మన్ కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.