ETV Bharat / business

Adani Aramco: ఆరామ్‌కోలో వాటా కొనుగోలుకు అదానీ గ్రూప్ యత్నం​! - అదానీ గ్రూపు

Adani Aramco: దిగ్గజ చమురు ఎగుమతి సంస్థ సౌదీ ఆరామ్‌కోలో వాటా కొనుగోలుకు అదానీ గ్రూపు యత్నిస్తోందని సమాచారం. ఈ మేరకు ఆరామ్‌కోతో పాటు సౌదీకి చెందిన పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్​తో అదానీ గ్రూపు ప్రాథమిక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

Adani Aramco
adani aramco deal
author img

By

Published : Mar 19, 2022, 5:38 AM IST

Adani Aramco: సౌదీ అరేబియాలో పెట్టుబడులు పెట్టేందుకు, భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా దిగ్గజ చమురు ఎగుమతి సంస్థ సౌదీ ఆరామ్‌కోలో వాటా కొనుగోలుకు యత్నిస్తోందని తెలుస్తోంది. పరస్పర సహకారం, ఉమ్మడి పెట్టుబడి అవకాశాలకు సంబంధించి సౌదీ ఆరామ్‌కోతో పాటు సౌదీకి చెందిన పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (పీఐఎఫ్‌)తో కూడా అదానీ గ్రూపు ప్రాథమిక చర్చలు జరిపినట్లు ఈ పరిణామాన్ని దగ్గర నుంచి గమనిస్తున్న వర్గాలు పేర్కొన్నాయి. ఆరామ్‌కోలో వాటా కొనుగోలు కోసం నగదు రూపేణా అదానీ పెట్టుబడులు పెట్టకపోవచ్చని, ఆస్తుల బదిలీ ఒప్పందం ద్వారా లావాదేవీని పూర్తి చేసే అవకాశం ఉందని తెలిపాయి. పునరుత్పాదక విద్యుత్‌, క్రాప్‌ న్యూట్రియెంట్స్‌, రసాయనాల విభాగాల్లో ఆరామ్‌కో లేదా ఆ సంస్థ అనుబంధ సంస్థ సబిక్‌తో అదానీ జట్టు కడుతుందని చెప్పాయి. అలాగే పీఐఎఫ్‌కు భారత్‌లోని మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని అదానీ కల్పించే అవకాశం ఉందని వెల్లడించాయి.

ప్రస్తుతానికైతే చర్చలు తొలి దశలోనే ఉన్నాయని, అదానీ ఈ సంస్థలతో ఏ రూపంలో సహకారాన్ని తీసుకోవాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌లో తన ఉనికిని విస్తరించుకునేందుకు అదానీతో ఒప్పందం ఆరామ్‌కోకు ఉపయోగపడనుంది. కాగా.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో వాటా కొనుగోలు కోసం 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు, రెండేళ్లకు పైగా ఆ సంస్థతో ఆరామ్‌కో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చర్చలను ఇరు సంస్థలు ఆపేశాయి. భారత్‌లో పెట్టుబడులు పెట్టడంపై తమకు ఆసక్తి ఉందని ఆ సమయంలో ఆరామ్‌కో స్పష్టం చేయడం గమనార్హం.

ఇదీ చూడండి: మస్క్​, జెఫ్​ బెజోస్​ను వెనక్కు నెట్టిన అదానీ.. మళ్లీ అగ్రస్థానం అంబానీకే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.