మొబైల్ సిమ్ కార్డు కొనుగోలు(new mobile connection) చేయాలంటే.. సమీప స్టోర్‌కు వెళ్లి ఆధార్, ఇతర సమాచారాన్ని అందించిన తర్వాతే మన చేతికి వస్తుంది. అయితే.. ఇకపై వినియోగదారులు ఆన్లైన్లో కొత్త మొబైల్ కనెక్షన్‌కు(aadhaar e-kyc for new mobile connections ) దరఖాస్తు చేసుకుని, ఇంటికే సిమ్ కార్డు పొందే సౌలభ్యాన్ని కల్పిస్తూ టెలికమ్యూనికేషన్ల విభాగం(డాట్) మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు ఆధార్ లేదా డిజిలాకర్‌లో భద్రపరిచిన పత్రాల ద్వారా ధ్రువీకరణ చేసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 15న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన టెలికాం సంస్కరణల్లో భాగంగా డాట్ ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త నిబంధనల ప్రకారం..
మొబైల్ కనెక్షన్ పొందేందుకు అవసరమైన ఆధార్ ఆధారిత ఇ-కేవైసీ(Aadhaar based e-KYC ) ధ్రువీకరణ ప్రక్రియకు వినియోగదారులు రూ.1 చెల్లించాలి. ఆధార్ ఇ-కేవైసీ ప్రక్రియను మళ్లీ తెచ్చేందుకు 2019 జులైలో బారత టెలికాం చట్టం 1885ను ప్రభుత్వం సవరించింది.
మరోవైపు.. కస్టమర్లు పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీ-పెయిడ్‌కు మారాలన్నా, ప్రీ-పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు మారాలన్నా ఆన్లైన్ నుంచే మార్చుకోవచ్చు. ఓటీపీ జనరేటెడ్ ఆధారిత ప్లాన్ మార్పు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది డాట్.
ఇదీ చూడండి: ఓటీపీతో పోస్ట్‌పెయిడ్ నుంచి ప్రీపెయిడ్కు