ETV Bharat / business

'2026 నాటికి భారత్​లో 35కోట్ల 5జీ కనెక్షన్​లు' - 5జీ సేవలు

2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3.5 బిలియన్​ మంది 5జీ సేవలను పొందుతారని ప్రముఖ టెలికాం కంపెనీ ఎరిక్సన్ తెలిపింది. అదే సమయానికి భారత్​లో ​5జీ వినియోగదారుల సంఖ్య 35కోట్లకు పైగా పెరుగుతుందని అంచనా వేసింది.

5G connection to reach 3.5 billion globally, 350 mn in India by 2026: Report
'2026 నాటికి భారత్​లో 30కోట్ల 5జీ కనెక్షన్​లు'
author img

By

Published : Nov 30, 2020, 10:08 PM IST

ప్రముఖ టెలికాం కంపెనీ ఎరిక్సన్..​ 5జీ సేవలపై కీలక ప్రకటనలు చేసింది. 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.5బిలియన్ల 5జీ కనెక్షన్​లు ఉంటాయని అంచనా వేసింది. భారత్​లో 2026 నాటికి 35కోట్ల మందికిపైగా 5జీ సాంకేతికతను వినియోగిస్తారని పేర్కొంది. వచ్చే ఏడాదిలో భారత్​కు మొదటి 5జీ కనెక్షన్​ రావచ్చని ఎరిక్సన్​ సంస్థ భారత అధ్యక్షుడు నితిన్ బన్సాల్​ ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు 15శాతం మంది 5జీ సాంకేతికతను వినియోగిస్తున్నారని 'ఎరిక్సన్​ మొబిలిటీ రిపోర్టు' లో సంస్థ వెల్లడించింది. 2026నాటికి ప్రపంచ జనాభాలో 60శాతం 5జీ టెక్నాలజీని వినియోగిస్తారని రిపోర్ట్​ తెలిపింది.

భారత్​లో అత్యధికంగా సరాసరి నెట్​ వినియోగం నెలకు 15.7జీబీగా ఉందని నివేదించింది. దేశంలో 63శాతం మంది మొబైల్ వినియోగదారులు 4జీని వినియోగిస్తున్నారని వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 70కోట్లమందికి పైగా ప్రజలు సెల్​ఫోన్ వినియోగిస్తున్నారని తెలిపింది. 2026నాటికి ఆ సంఖ్య 100కోట్లు దాటుతుందని అంచనా వేసింది.

ఇదీ చదవండి: హలో 5జీ: నయా నెట్​వర్క్​ ప్రత్యేకతలేంటి ?

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.