గత 12 నెలల్లో తాము సైబర్ దాడికి గురైనట్లు 52% కంపెనీలు తెలిపాయని, ఇవన్నీ సైబర్ భద్రత కోసం నిధులు కేటాయించిన సంస్థలేనని సోఫోస్ తన 'ద ఫ్యూచర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఇన్ ఏషియా పసిఫిక్ అండ్ జపాన్' సర్వేలో వెల్లడించింది.
సోఫోస్ సర్వే ప్రకారం...
- సైబర్ భద్రత కోసం కంపెనీలు బడ్జెట్లు పెంచడం లేదు. సైబర్ దాడులు కలిగించే ప్రమాద స్థాయిని అవి సరిగ్గా అంచనా వేయలేక పోతున్నాయి. తీవ్రమైన లేదా అతి తీవ్రమైన దాడులు జరిగాయని 71 శాతం కంపెనీలు అంచనా వేశాయి.
- భారత్ లో భద్రతా బడ్జెట్ ఉన్న కంపెనీల శాతం ఎక్కువే. వచ్చే 24 నెలల్లో సాంకేతిక బడ్జెట్ల సగటు ప్రస్తుత 9 శాతం నుంచి 10 శాతానికి పెరగొచ్చు. వచ్చే 24 నెలల్లో మాల్వేర్, కృత్రిమ మేధ/మెషీన్ లెర్నింగ్ ఆధారిత దాడులు కంపెనీ సైబర్ భద్రతకు తీవ్ర విఘాతాన్ని కలిగించవచ్చు.
ఇదీ చూడండి:ఆటో డెబిట్ సేవలకు ఇక కొత్త రూల్స్