ETV Bharat / business

త్వరలో మొబైల్ డేటా ఛార్జీల మోత!

త్వరలో మొబైల్ డేటా ఛార్జీలు పెరుగుతాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే కాల్​ ఛార్జీలు పెంచిన టెలికాం సంస్థలు.. మళ్లీ ఇప్పడు డేటా ఛార్జీల పెంపునకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఛార్జీల పెంపునకు టెల్కోలు చెబుతున్న కారణమేంటి? ఎంత మేర ఛార్జీలు పెరగనున్నాయి? అనే విషయాలు వివరంగా మీ కోసం.

data charges may hike coming days
డేటా ఛార్జీల పెంపునకు
author img

By

Published : Mar 14, 2020, 12:44 PM IST

మూడు నెలల క్రితం రూ.400 ఉన్న మొబైల్ రీఛార్జ్​ ప్లాన్​కు ఇప్పుడు రూ.600 చెల్లించాల్సి వస్తోంది. పలు కారణాలతో టెలికాం సంస్థలు పెంచిన ఛార్జీలు ఇందుకు కారణం. అయితే ఇప్పుడు మళ్లీ ఛార్జీల పెంపునకు టెలికాం సంస్థలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సారి డేటా ఛార్జీలు పెంచాలని ఆయా సంస్థలు భావిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి వినతులు కుడా సమర్పించాయి ప్రధాన టెల్కోలు. వాటి ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే వినియోగదారుల జేబుకు చిల్లు పడటం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు.

గతంలో పరిస్థితి ఇది..

దేశంలో 2014లో ఒక జీబీ డేటాకు రూ. 250పైగా చెల్లించాల్సి వచ్చేది. అయితే 2016 నుంచి డేటా ఛార్జీలు భారీగా తగ్గుతూ వచ్చాయి. ముఖ్యంగా జియో రాకతో పాటు, 4జీ టెక్నాలజీ విస్తృతం అవటం ఇందుకు ప్రధాన కారణం. ఇలా తగ్గుతూ వచ్చిన ధరలు దాదాపు మూడు నెలల క్రితం ఒక జీబీ డేటాకు రూ.3 నుంచి రూ.4గా ఉండేది.

భారీ నష్టాలు..

జియో రాకతో టెల్కోల మధ్య పోటీ తీవ్రమైంది. చిన్న చిన్న సంస్థలు మూతపడటం, ఇతర సంస్థల్లో విలీనం అవ్వడం వంటి పరిణామాలు జరిగాయి. దిగ్గజ సంస్థలు వొడాఫోన్, ఐడియాల విలీనానికి ఈ అంశమే కారణమైంది.

సుప్రీంకోర్టు తీర్పు..

వొడాఫోన్ ఐడియా 2019-20 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 50,921 కోట్లు నష్టాలను చవిచూసింది. దేశంలో ఒక కంపెనీ ఇంత నష్టం నమోదు చేయడం ఇదే ప్రథమం. భారతీ ఎయిర్​టెల్ కూడా రూ. 31వేల కోట్లకు పైగా నష్టం నమోదు చేసింది.

అక్టోబర్​లో సుప్రీం కోర్టు... టెలికాం కంపెనీల సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)కు సంబంధించిన తీర్పు నిచ్చింది. దీని ప్రకారం కంపెనీలు రూ.1.4 లక్షల కోట్లకు పైగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వొడాఫోన్ ఐడియా, ఎయిర్​టెల్​ వాటాలే అధికం.

తొలి సారి ఛార్జీల పెంపు..

ఆర్థికపరంగా తీవ్ర సమస్యల్లో ఉన్న టెలికాం సంస్థలకు ఏజీఆర్ తీర్పు మరింత భారంగా మారింది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్​లో టారిఫ్​లను దాదాపు రెండు రెట్లు పెంచాయి. ఆర్థిక సమస్యలతో పాటు, తక్కువ టారిఫ్​లు, పెట్టుబడి అవసరాల దృష్ట్యా ఈ పెంపు అనివార్యమని కంపెనీలు తెలిపాయి. గత మూడు సంవత్సరాల్లో ఈ పెంపుదల మొదటిది కావటం గమనార్హం.

మళ్లీ ఇప్పుడు..

ఏజీఆర్ బకాయిలపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలని చేసిన విన్నపాన్ని సుప్రీం కోర్టు జనవరిలో తిరస్కరించింది. ఈ కారణంగా మనుగడ సాధించాలంటే ఛార్జీల పెంపు తప్ప వేరే మార్గం లేదని ప్రధాన టెలికాం సంస్థలు ప్రభుత్వానికి వినతులు సమర్పించాయి. పలువురు నిపుణులూ ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తుండటం గమనార్హం.

ఆమోదమే తరువాయి

కొంతకాలం క్రితం ఒక నెట్​వర్క్ నుంచి ఇంకో నెట్​వర్క్​కు ఫోన్ చేస్తే వసూలు చేసే ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జీలు (ఐయూసీ) లను ట్రాయ్ నిమిషానికి 6 పైసలుగా నిర్ణయించింది. ఇప్పుడు డేటాకు కనీస ఛార్జీలు నిర్ణయించాలని ప్రభుత్వానికి విన్నవించాయి టెల్కోలు. ఒకవేళ ప్రభుత్వం వాటికి ఆమోదం తెలిపితే.. ప్రస్తుతం ఉన్న డేటా ఛార్జీలు కనీసం 5 నుంచి 10 రెట్లు పెరిగే అవకాశం ఉంది.

టెల్కోల ప్రతిపాదనలు ఇవి

జీబీ డేటాను రూ.35గా ఉండాలని వొడాఫోన్-​ఐడియా కోరుతుండగా, ఎయిర్​టెల్​ రూ.30 నిర్ణయించాలని సూచించింది. జియో మాత్రం జీబీ డేటాను రూ.20 వరకు పెంచాలని కోరింది. వినియోగదారులు ధరల పెరుగుదల పట్ల సున్నితంగా వ్యవహరిస్తోన్న దృష్ట్యా ఈ పెంపు ఒకేసారి కాకుండా క్రమక్రమంగా ఉండాలని ట్రాయ్​కి రాసిన లేఖలో సూచించింది.

ఎంతో కొంత పెరిగే అవకాశం..

కంపెనీలు కోరినట్లు కాకుండా ఎంతో కొంత పెంపు అనేది ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనికి నీతి ఆయోగ్ మద్దతిస్తుండగా.. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మాత్రం వ్యతిరేకిస్తోంది.

కనీస ధరలను మొదట వ్యతిరేకించిన నీతి ఆయోగ్.. టెలికాం రంగం మనుగడ కోసం కనీస ధర నిర్ణయించాలని సూచిస్తోంది. ఇప్పటికే నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మొబైల్ డేటా, కాల్​లకు కనీస ధరలు ఉండాలని ట్రాయ్​కు రాసిన లేఖలో సూచించారు.

కంపెనీల మధ్య పోటీతత్వాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన సీఐఐ మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే కొత్తగా టెలికాం రంగంలో ప్రవేశించటం కష్టతరమౌతోందని అభిప్రాయపడింది.

ఇదీ చూడండి:కూలర్​ కొంటున్నారా? మరి వీటి గురించి తెలుసుకున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.