ETV Bharat / business

బడ్జెట్‌పై కోటి ఆశలున్నా...ఆర్థిక వ్యవస్థలో 'నిర్మల'త్వం ఏదీ!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ప్రజలంతా ఆశలు పెట్టుకున్నారు. మందగమనం నుంచి తమను గట్టెక్కించాలని వేడుకుంటున్నారు. ఈ అంశాలపై ప్రత్యేక కథనం..

2020-21 budget: finance minister should consider these things
ఆర్థిక వ్యవస్థలో నిర్మలత్వం ఏదీ!
author img

By

Published : Jan 29, 2020, 9:05 AM IST

Updated : Feb 28, 2020, 9:06 AM IST

ప్రపంచ దేశాలన్నీ 2018-19 ప్రారంభంలో ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటే... మనదేశం ఏకంగా 8% వృద్ధిరేటుతో ఔరా...! అనిపించుకుంది. ఇంతలోనే పరిస్థితి తలకిందులైంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ప్రజలంతా ఆశలు పెట్టుకున్నారు. మందగమనం నుంచి తమను గట్టెక్కించాలని వేడుకుంటున్నారు... ఈ అంశాలపై ప్రత్యేక కథనం...

2020-21 budget: finance minister should consider these things
కేంద్ర బడ్జెట్‌పై కోటి ఆశలున్నా...!

ఎక్కడా గిరాకీ లేదు. అన్ని రంగాల్లోనూ స్తబ్దత ఆవహించింది. వృద్ధిరేటు దారుణంగా పడిపోతోంది. ఉత్పాదక రంగం బేలచూపులు చూస్తోంది. నిరుద్యోగం సర్రున ఎగబాకుతోంది. ఆర్థిక వ్యవస్థ మందగమనం దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మాంద్యం ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్న ఈ పరిస్థితుల్లో.. యావద్దేశం ఇప్పుడు కేంద్ర బడ్జెట్‌ వైపు చూస్తోంది. ఆర్థిక వ్యవస్థకు నూతన జవజీవాలు అందించడానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఎలాంటి ఉద్దీపనలతో ముందుకొస్తారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. వేతన జీవులు, నిరుద్యోగులు, రైతులు, పారిశ్రామివేత్తలు, పెట్టుబడిదారులు, వ్యాపారులు, మహిళలు.. ఇలా ప్రతిఒక్కరూ కేంద్ర బడ్జెట్లో ఎంతోకొంత ఊరటనిచ్చే అంశాలుంటాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. దేశంలో ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఆర్థిక వ్యవస్థలో ఈ ఒడిదుడుకులకు కారణాలు ఏమిటి? ఏయే రంగాలు, వర్గాలు బడ్జెట్లో ఏమేం ఆశిస్తున్నాయి? అనేవి బడ్జెట్‌ సమర్పణకు ముందుగా పరిశీలన చేసుకోవాల్సిన అంశాలు.

finance minister
నిర్మలా సీతారామన్​

దేశ ఆర్థిక వ్యవస్థను వచ్చే అయిదేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు 5%కి పరిమితం కావడం, మున్ముందు అది 4.5%కి తగ్గిపోతుందన్న హెచ్చరికలు ఆర్థిక ప్రణాళికకర్తల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2008-09 తర్వాత వృద్ధిరేటు 5%కి పడిపోవడం ఇదే తొలిసారి. 2018-19 తొలి త్రైమాసికంలో 8% మేర కనిపించి, ప్రపంచాన్ని అబ్బురపరచిన వృద్ధిరేటు ఆ తర్వాత వరుసగా 7, 6.6, 5.8%కి పడిపోయింది. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగానూ దేశ పరపతి స్థాయి తగ్గుతోంది. వృద్ధిరేటు పుంజుకునే చర్యల్ని బడ్జెట్‌లో ప్రకటించడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సవాలు.

డిమాండు : నేల చూపులు

దేశంపై మాంద్యం ఛాయల ప్రభావం లేదని ప్రభుత్వ వర్గాలు ఉద్ఘాటిస్తున్నప్పటికీ.. ఘోరంగా పడిపోయిన పెట్టుబడులు, గిరాకీ, వినియోగం ఈ లక్షణాల్ని తేటతెల్లం చేస్తున్నాయి. ముఖ్యంగా గిరాకీ లేమి దెబ్బకు అన్ని వ్యవస్థలూ విలవిల్లాడుతున్నాయి. పారిశ్రామిక, ఆటోమొబైల్‌, స్థిరాస్తి రంగాల్లో దీని తీవ్రత ఎక్కువుంది. పన్ను వసూళ్లలో లక్ష్యాలు చేరుకోలేని పరిస్థితి.

  • వినియోగదారుల వ్యయ సర్వే ప్రకారం... తలసరి ౖకుటుంబ నెలవారీ వ్యయం 2011-12లో రూ.1,501 ఉండగా 2017-18 సంవత్సరానికి వచ్చేసరికి రూ.1,446కి పడిపోయింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గ్రామీణుల ఖర్చు ఏకంగా 8.8% పడిపోయింది. పట్టణాల్లో 2% పెరిగింది.

దేశంలో నల్లధనం వెలికితీతకు 2016లో ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు, ఏకీకృత పన్ను విధానానికి 2017-18లో తీసుకొచ్చిన జీఎస్‌టీ అనంతరం పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పెద్దనోట్ల రద్దు తర్వాత స్థిరాస్తి రంగం కుదేలైంది. ఆ కష్టాలు నేటికీ కొనసాగుతున్నాయి. దీనివల్ల అసంఘటిత రంగ కార్మికులు భారీ ఎత్తున ఉపాధి కోల్పోయారు. ఇక జీఎస్‌టీలోని కొన్ని లోపాలు, అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు చిన్న వ్యాపారులకు ఇబ్బందిగా మారాయి. పన్ను చెల్లింపుల్లో సంక్లిష్టతల కారణంగా చిన్న వ్యాపారాలు బోర్డులు తిప్పేస్తుండటంతో కిందిస్థాయిలో వేల మంది బజారునపడుతున్నారు.

వ్యవసాయం: నెమ్మదించిన వైనం

దేశంలో ఉద్యోగితను కల్పించే వాటిలో రెండో అతిపెద్ద రంగమైన వ్యవసాయంలో వృద్ధిరేటు 2% మాత్రమే నమోదవుతోంది. 2002-11 మధ్య జీడీపీలో వ్యవసాయ ఆదాయం 4.4%గా ఉండగా.. ప్రస్తుతం 3.1%నికి పడిపోవడం గమనార్హం. ఈ కారణంగా రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్రం ఆశలు ఈ బడ్జెట్లో ఎలా ప్రస్ఫుటిస్తాయన్నది కీలకం.

ప్రభుత్వం: ఖర్చుల్లో కోత

వివిధ కారణాలతో ప్రభుత్వ ఆదాయం తగ్గడంతో అది చేస్తున్న ఖర్చుల్లో కోతలు పడుతున్నాయి. ఇది ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపుతోంది. ఆర్‌బీఐ అంచనా ప్రకారం... 2017-18లో ప్రభుత్వం చేసిన ఖర్చు కారణంగానే దేశ ఆర్థిక రంగం 11% పెరిగింది. 2018-19లో వివిధ రాష్ట్రాల శాసనసభలకు, లోక్‌సభకు ఎన్నికలు జరగడంతో.. అభివృద్ధిపై ప్రభుత్వం చేసే ఖర్చులు తగ్గాయి. ఫలితంగా ప్రజలకు డబ్బు అందక ఆర్థికరంగం మందగమనానికి మరో కారణమైంది.

ద్రవ్యోల్బణం: ఆరేళ్ల గరిష్ఠ రికార్డు

ఆహార ద్రవ్యోల్బణమూ భారీగా పెరుగుతోంది. 2019 ఆగస్టులో 3% ఉన్న ద్రవ్యోల్బణం నవంబర్‌కల్లా 10%కి, డిసెంబర్‌కి 14%కి చేరి ఆరేళ్ల గరిష్ఠ రికార్డును బద్దలు కొట్టింది. ముఖ్యంగా కూరగాయల ధరలు 60%, పప్పుదినుసుల ధరలు 15%కి పైగా పెరిగాయి. ఉల్లి కిలో రూ.150 వరకు వెళ్లి ప్రస్తుతం రూ.60 దగ్గర స్థిరపడింది. వంటనూనెల ధరలూ రూ.125కిపైగా చేరాయి. వినియోగదారుడి చేతుల్లో ఉన్న కాస్త డబ్బునూ తిండికోసమే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండటంతో మిగతా రంగాల డిమాండ్‌ మరింత కుచించుకుపోతోంది.

నిరుద్యోగం: 45 ఏళ్ల గరిష్ఠానికి

కేంద్రం వెంటనే దృష్టి సారించాల్సిన మరో కీలకాంశం నిరుద్యోగం. ఇది 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతస్థాయికి చేరింది. ఈ కారణంగానే గ్రామాల్లో గిరాకీ భారీగా పడిపోయింది. పట్టణ ప్రాంతాల నిరుద్యోగమూ జాతీయ సగటుకంటే ఎక్కువగానే ఉంది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(ముంబయి) ప్రకారం... 2019 తొలి త్రైమాసికంలో 6.65% ఉన్న నిరుద్యోగం నాలుగో త్రైమాసికానికి వచ్చేసరికి 7.7 శాతానికి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం విడుదల చేసిన లెక్కల ప్రకారమూ 6.1%గా నమోదైంది. 20-24 మధ్య వయస్సున్న వారిలో నిరుద్యోగం 37% ఉంది.

ద్రవ్యలోటు: తీవ్ర ఆందోళనకరం

బడ్జెటేతర రుణాలతో కలిపితే ద్రవ్యలోటు దాదాపు 5% చేరింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్యలోటు సైతం జీడీపీలో 3%కి చేరింది. ఇది మొన్నటి బడ్జెట్‌లో చూపిన 2.6% కంటే ఎక్కువ. డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గుతుండటంతో ప్రజల వ్యక్తిగత పొదుపూ తగ్గుతోంది. ఈ కారణంగా బ్యాంకులకు నగదు చేరడంలేదు. మున్ముందు వనరుల సమీకరణకు భారతీయ కార్పొరేట్‌ సంస్థలు విదేశీ మార్కెట్‌కు వెళ్లాల్సిన ఆగత్యం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ రుణాలు గత ఒక్క ఏడాదే 22 బిలియన్‌ డాలర్లకు చేరడం పై అభిప్రాయాన్ని బలపరుస్తోంది.

ఎఫ్‌డీఐలు : చైనా కంటే వెనుకబాటే

ప్రస్తుత పరిస్థితులు విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేలా లేవు. 2018లో చైనా 107 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు ఆకర్షించగా భారత్‌ 55 బిలియన్‌ డాలర్లకే పరిమితమైంది. 2014-15లో జీడీపీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) అంతకుముందు ఏడాది కంటే 25% పెరిగాయి. ఆ తర్వాత నుంచి వృద్ధిరేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2018-19 నాటికి కేవలం 2శాతానికి మాత్రమే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. కార్పొరేట్‌ పన్నును 30 నుంచి 22%కి తగ్గించి సులభతర వాణిజ్య ర్యాంకుల్లో భారత్‌ ప్రపంచంలో 63వ స్థానానికి ఎగబాకినా విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తడంలేదు.

ఆర్థిక మంత్రీ.. ఈ వినతులు వినండి

దేశంలో డిమాండ్‌ను సృష్టించి ఆర్థిక వ్యవస్థను మళ్లీ వృద్ధి దిశగా పరుగులు తీయించడానికి ఆర్థిక, పారిశ్రామిక వేత్తలు, వినియోగ, వ్యవసాయ నిపుణులు ఏమేం కోరుతున్నారంటే...

  • మధ్యతరగతి ప్రజల చేతుల్లోకి మరింత డబ్బు వచ్చేలా చూడటం.
  • ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం. రూ.10 లక్షల వార్షిక వ్యక్తిగత ఆదాయం ఉన్న వారికి మరింత రాయితీ ఇవ్వడం.
  • దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను రద్దు లేదంటే తగ్గింపు.
  • నిర్మాణ, రవాణా, వాహన తదితర రంగాలకు జీఎస్టీ కోత.
  • ప్రత్యక్ష పన్ను కోడ్‌ అమలు.
  • ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి సాయాన్ని రూ.6వేల నుంచి రెట్టింపు చేయడం. మరింత మందికి విస్తరించడం.
  • జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంపు.
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీల ఉపకార వేతనాల పెంపు.
  • చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కోలుకునేందుకు దీర్ఘకాలిక ఆర్థిక వనరుల సాయం. ట్యాక్స్‌ హాలీడే, ఉద్దీపనలు ప్రకటించడం.

ఇదీ చూడండి: కరోనా 'పిశాచి'ని నియంత్రిస్తాం : జిన్‌పింగ్‌

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Tokyo - 27 January 2020
1. Wide of pharmacy
2. Various of empty shelves where mask supplies have run out
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Ginza, Tokyo – 27 January 2020
3. Wide of pharmacy store
4. Shoppers inside pharmacy
5. SOUNDBITE (English) Christine Yuuki, Chinese tourist from Hefei:
"I help my friends buy some masks, and my family, they need masks because in China masks are very expensive. So one little pack of mass is more than 100 RMB (Chinese Yuan, about $15), so here it is cheaper and easier to buy the masks."
6. Various of people wearing masks in pharmacy
7. SOUNDBITE (Japanese) Masumi Tsuchida, Japanese worker in hotel industry:
"I work in a hotel so there are times when inbound customers for example from China visit, so when foreigners come to Japan I am a little worried. But I wear a mask and when I get home, I will use disinfectant spray."
8. SOUNDBITE (Japanese) Hiromasa Kobayashi, resident working in food industry :
"When I get it (the virus) then I get it. I don't like wearing masks so I try not to wear one. I usually don't wear one anyway."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Tokyo - 28 January 2020
9. Wide of Toshihiro Nagahama, Executive Chief Economist, Dai-ichi Life Research Institute
10. SOUNDBITE (Japanese) Toshihiro Nagahama, Executive Chief Economist, Dai-ichi Life Research Institute:
"In the market, the industries that stand out to have negative impact (from this virus) are aviation related companies and railways. Cosmetic makers that Chinese tourists like and such companies may also face negative effects. On the other hand, there are some positive effects on masks and other retailers selling things to protect yourself against the virus."
11. Close of Nagahama speaking
12. Wide of Nagahama
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Tokyo – 27 January 2020
13. Close of box of masks
14. Mid of mask products
15. Close of mask products
16. Wide of Yasuyuki Shibata from the Iris Ohyama mask-manufacturing company
17. Close of mask package
18. SOUNDBITE (Japanese) Yasuyuki Shibata, Iris Ohyama mask manufacturer:
"The sales for the last week are about three times as much as the previous week before that. If you go on a year-on-year basis, sales are about twice that of last year's although last year influenza was prevalent."
19. Wide of Shibata talking
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Narita Airport, Japan – 23 January 2020
20. Line for quarantine screening
21. Mid of screening monitor
22. Close of monitor
23. Warning sign of the coronavirus
24. Wide of quarantine area
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Yokohama – 25 January 2020
21. Various of crowds and people in masks during Lunar New Year celebrations
STORYLINE:
Surgical masks are common in Japan as a protection for winter flu or pollen allergy, but this year demand has shot up in the wake of the new coronavirus scare, causing supply shortages within the first week of the outbreak.
In Tokyo's upscale shopping district of Ginza, residents and tourists alike were buying masks wherever they could find them.
Even sales staff at Japanese department stores have started wearing masks.
Tobu department store put up a notice, saying the rare measure was necessary for health reasons.
Masumi Tsuchida said she started wearing a mask at the hotel where she works, because many Chinese tourists stay there.
The virus originated in the Chinese city of Wuhan.
Christine Yuuki, a tourist from China, said she was looking for masks to bring back for her friends and family, as they've become expensive and hard to find back home.
"In China, masks are very expensive," she said, adding that one little pack of masks costs more than 100 yuan (US$14). "They are cheaper here and easier to buy."
But they are disappearing quickly. At pharmacies and convenience stores in popular tourist hubs in downtown Tokyo, supplies are dwindling or are sold out completely.
Iris Ohyama, a major Japanese manufacturer of household goods and home appliances, said it had been flooded with orders from drug stores across Japan for surgical masks since the outbreak.
Sales were three times as high as the previous week, it said.
In order to meet soaring demand, the company's workers at one of its two factories in China had to cut short their 10-day Lunar New Year holidays to just three days, said company official Yasuyuki Shibata.
But the impact on the wider Japanese economy will be negative, with transportation companies likely to be among the sectors hardest hit, according to Toshihiro Nagahama, chief economist at the Dai-ichi Life Research Institute.
Nagahama calculated that if the coronavirus outbreak lasts for four months, like the SARS outbreak in 2002-2003, Japan could suffer a 520 billion yen (4.76 billion US dollar) drop in GDP.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 9:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.