ETV Bharat / budget-2019

దేశమంతా ఒకే కార్డుతో ప్రయాణం

దేశవ్యాప్తంగా ఏకీకృత రవాణా వ్యవస్థ ఏర్పాటుకు కృషిచేస్తున్నామన్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. దేశంలో ఎక్కడైనా, ఎలాగైనా ప్రయాణం చేసేందుకు పనికొచ్చేలా నేషనల్​ ట్రాన్స్​పోర్టు కార్డు తెస్తున్నామని ఆమె తెలిపారు. అంతర్గత జలరవాణాకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. విద్యుత్ వాహనాలకు రాయితీలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

'ఏకీకృత రవాణా వ్యవస్థ' కోసం ప్రత్యేక విధానం
author img

By

Published : Jul 5, 2019, 12:27 PM IST

Updated : Jul 5, 2019, 4:49 PM IST

దేశ వ్యాప్తంగా ఏకీకృత రవాణా వ్యవస్థ ఏర్పాటుకు ప్రత్యేక విధానం రూపొందించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉపయోగపడేలా నేషనల్​ ట్రాన్స్​పోర్టు కార్డు తెస్తున్నామని ఆమె తెలిపారు.

భారత్​మాల, సాగర్​మాల, ఉడాన్​ పథకాలు... గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య దూరం తగ్గించనున్నాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

దేశమంతా ఒకే కార్డుతో ప్రయాణం

ఉడాన్ పథకం..

ఉడాన్​ పథకంతో చిన్న పట్టణాలకూ విమానసేవలు అందుబాటులోకి వచ్చాయని నిర్మలాసీతారామన్ తెలిపారు.

"ఉడాన్ పథకం ద్వారా చిన్న పట్టణాలకూ విమాన సేవలు విస్తరించాం. ఫలితంగా సాధారణ పౌరులకూ విమానాయానం సాకారమవుతోంది. నూతన మెట్రో ప్రాజెక్టులో భాగంగా 2018-19 సంవత్సరానికి గాను 300 కి.మీ మెట్రో మార్గాల నిర్మాణానికి అనుమతి ఇచ్చాం. ఇప్పటికే వివిధ నగరాల్లో 637 కి.మీ మెట్రో రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్త ఏకీకృత రవాణా వ్యవస్థలో భాగంగా నేషనల్​ ట్రాన్స్ పోర్ట్​ మొబిలిటీ కార్డు ప్రవేశపెట్టాం. దీని ద్వారా ప్రజలు బహుముఖంగా రవాణా ఛార్జీలు చెల్లించవచ్చు. ఈ కార్డుతో దేశంలో ఎక్కడైనా రైల్వే చార్జీలు, టోల్​ టాక్స్​లను చెల్లించవచ్చు. రూపే కార్డు ద్వారా టోల్​ టాక్స్, బస్సు ఛార్జీలను చెల్లించవచ్చు. అదే కార్డుతో షాపింగ్​ చేయవచ్చు. ఏటీఎంల నుంచి నగదునూ తీసుకోవచ్చు." - నిర్మలా సీతారామన్​, ఆర్థిక మంత్రి

రైలు మార్గాలు..

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రైల్వేల్లో నూతన విధానం చేపడతామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2018-19 మధ్య 300 కి.మీ మెట్రో ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో 637కి.మీ మెట్రో రైలు మార్గం అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు.

2018-30 మధ్య రైల్వేల ఆధునికీకరణకు రూ.50 లక్షల కోట్లు అవసరమవుతాయని ఆర్థికమంత్రి వెల్లడించారు. పీపీపీ విధానంలో మెట్రో రైళ్ల నిర్మాణానికి మరింత ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. ప్రయాణ, సరుకు రవాణా సేవల మెరుగుదలకు ఈ విధానం ద్వారా ముందుకు వెళతామని స్పష్టం చేశారు.

భారత్​మాల

భారత్​మాల పథకం ద్వారా రహదారులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. గ్రామ సడక్ యోజన ద్వారా రూ.80,250 కోట్లతో 1.25 లక్షల కి.మీ రహదారుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగంతో 30 వేల కి.మీ గ్రామీణ రహదారుల నిర్మించనున్నట్లు ప్రకటించారు.

విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహం

విద్యుత్ వాహనాలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. విద్యుత్​ వాహనాలపై ఉన్న జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే యోచన చేస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం జీఎస్టీ కౌన్సిల్ ముందు ఓ ప్రతిపాదన ఉంచినట్లు ఆమె వెల్లడించారు.

జల రవాణాకు ప్రోత్సాహం

రోడ్లు, రైలు మార్గాలపై ఒత్తిడి తగ్గించేందుకు జలరవాణాను ప్రోత్సహిస్తున్నామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అందుకోసం జలమార్గ్​ వికాస్​ పథకంతో అంతర్గత జలరవాణాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: బడ్జెట్​ 2019 : 'నవీన భారతావనికి 10 సూత్రాలు'

Intro:Body:

e

Conclusion:
Last Updated : Jul 5, 2019, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.