అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)కు త్వరలోనే కొత్త సారథి రానున్నారు. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకులో ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న క్రిస్టాలినా జార్జివా ఎంపిక ఖాయంగా కనిపిస్తోంది. ఆమె అభ్యర్థిత్వానికి పోటీ లేకపోవటమే ఇందుకు కారణం.
ప్రస్తుతం ఐఎంఎఫ్ అధినేతగా ఉన్న క్రిస్టిన్ లగార్డే ఐరోపా కేంద్ర బ్యాంకు సారథిగా వెళ్లనున్న నేపథ్యంలో క్రిస్టాలినా ఎన్నిక అనివార్యమయింది.
ఇదీ చూడండి: సెప్టెంబర్ 27న ఐరాసలో మోదీ ప్రసంగం