ETV Bharat / briefs

'ప్రభుత్వ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం'

ఓ పక్క ఇంటర్ ఫలితాల తారుమారుతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరో పక్క సీఎం కేసీఆర్ విహార యాత్రలు చేస్తున్నారని అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేస్తాం : కోదండరాం
author img

By

Published : May 12, 2019, 9:44 PM IST

విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం కేసీఆర్ మాత్రం విహార యాత్రలు చేస్తున్నారని సీపీఐ నేత చాడ వెంకట్​రెడ్డి మండిపడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఇంటర్ ఫలితాల గందరగోళంపై జరిగిన అఖిల పక్ష నేతల సమావేశంలో ఆయన ఘాటుగా స్పందించారు. ఇంటర్ బోర్డు ఫలితాల అవకతవకలపై విద్యార్థి సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో భవిష్యత్ కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు.
ఈ పరిణామాలపై రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ తీరుపై లేఖ అందిస్తామని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల పదో తరగతి మెమోలు జతచేసి... జాతీయ మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ప్రొ.కోదండరాం, కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్‌, ప్రొ.పీఎల్ విశ్వేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

అఖిలపక్ష సమావేశంలో నేతలు

ఇవీ చూడండి : ఉగ్రరూపంలో భానుడు... నేనొస్తానంటున్న వరుణుడు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.