కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. దిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరయ్యారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు:
1.న్యాయ్ పథకం ద్వారా కనీస ఆదాయం లేని పేదలకు ప్రతినెల రూ.6వేలు, సంవత్సరానికి 72 వేలు, ఐదేళ్లకు 3లక్షల 60వేల ఆర్థిక సాయం.
2. నిరుద్యోగులకు ఉపాధి కల్పన. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్. మార్చి 2020 నాటికి 12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ. 10లక్షల గ్రామీణ యువతకు ఉద్యోగాలు.
3. జాతీయ భద్రత, రక్షణకు పెద్ద పీట.
4. విద్యారంగానికి జీడీపీలో ఆరు శాతం నిధులు కేటాయింపు.
5. ఐదేళ్లలో భాజపా సమాజంలో చీలిక తెచ్చింది, ప్రజల ఐక్యతే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుంది.