ఆదివాసీలకు మేమున్నాం: కోదండరామ్ - professor
ఆదివాసీ హక్కుల రక్షణ యాత్ర ఇది రెండో రోజు. ఇవాళ నర్సంపేటలో ప్రారంభమై... మేడారం వద్ద ముగుస్తుంది. ఆదివాసీ నాయకులు, గిరిజన, గిరిజనేతరులతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకుంటున్నాం. హరితహారం పేరిట గిరిపుత్రులను అడవుల నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం సరికాదు. ----- తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్
ఆచార్య కోదండరామ్
ఆదివాసీల తరఫున మాట్లాడే రాజకీయ పార్టీ లేదని... వారి ప్రతినిధులుగా గెలిచిన నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు ఆచార్య కోదండరామ్. తెలంగాణ జన సమితి చేపట్టిన ఆదివాసీల హక్కుల రక్షణ యాత్రలో ఆయన పాల్గొన్నారు. గిరిపుత్రులపై ప్రభుత్వం అణిచివేత ధోరణి అవలంభిస్తోందని ఆరోపించారు. వారి తరపున తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
sample description
Last Updated : Mar 17, 2019, 6:02 PM IST