ETV Bharat / briefs

విశాఖ మన్యంలో వేలకోట్ల గంజాయి సాగు

కొండల మధ్య నుంచి జాలువారే సెలయేళ్లు... భూమాతకు చీర సింగారించినట్టుండే పచ్చని సోయగాలు... ఎటు చూసినా ర‌మ‌ణీయ‌త ఉట్టిప‌డేట్టుండే ముగ్ధ మ‌నోహ‌ర దృశ్యాలు... వర్ణించలేని అందాలకు నెలవు విశాఖ మన్యం. ఈ సౌందర్యం మాటున ఓ వికృత కార్యం రాజ్యమేలుతోంది. కొండకోనల్లో "మత్తు" వ్యవసాయం జోరుగా సాగుతోంది. ప్రతిఏటా ఇక్కడ జరిగే వ్యాపారం ఎన్నివేల కోట్ల రూపాయలో తెలుసుకోవాలనుందా...!?

ఏపీ విశాఖ మన్యం
author img

By

Published : May 29, 2019, 11:51 AM IST

Updated : May 29, 2019, 12:12 PM IST

ఆంధ్రప్రదేశ్​లో విశాఖ మన్యం అనగానే అందరికీ గుర్తొచ్చేది అక్కడి ప్రకృతి రమణీయత. ఊటీలోని అందాలను... కొడైకెనాల్​లోని సోయగాలను మేళవించినట్లుండే ఆహ్లాదం అరకు సొంతం. అటువంటి కమనీయత మాటున 'నిగూఢ సాగు' జరుగుతోంది. కొండకోనల్లో నివసించే అమాయకపు ఆదివాసీల జీవన విధానం రోజురోజుకూ కలుషితమవుతోంది. పచ్చని చెట్ల చాటున గంజాయి ఏపుగా పెరుగుతోంది.

ఏపీ విశాఖ మన్యంలో గంజాయి అక్రమ సాగు

మన్యం టూ మహానగరం...

ఏపీలో విశాఖ మన్యంలో పండించిన గంజాయి దేశ నలుమూలలకూ చేరుతోంది. మహారాష్ట్ర నుంచి మొదలుకొని నాగపూర్, హైదరాబాద్, విజయవాడ, చెన్నై తదితర నగరాలకు రవాణా జరుగుతోంది. ఒకప్పుడు నామమాత్రంగా ఉన్న గంజాయి సాగు... మాఫియా రంగ ప్రవేశంతో మహావృక్షంలా తయారైంది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన ముఠాల రాకతో సాగు వేల ఎకరాలకు చేరింది.

12 వేల ఎకరాల్లో...

ఆంధ్రప్రదేశ్​లో మొత్తం 15 వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. ఒక్క విశాఖలోనే 12 వేల ఎకరాల్లో ఈ పంట పండిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 2,250 ఎకరాలు, మిగతా జిల్లాల్లో 750 ఎకరాల్లో ఈ సాగు జరుగుతోందని ఎక్సైజ్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మన్యంలో ప్రతిఏటా 3 లక్షల టన్నుల గంజాయి దిగుబడి వస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని 11 మండలాల్లో 159 గ్రామాల్లో ప్రధానంగా గంజాయి సాగవుతోంది.

రూ.5,400 కోట్ల వ్యాపారం...

మన్యంలో కనీవినీ ఎరగని రీతిలో గంజాయి వ్యాపారం జరుగుతోంది. ఒక్కో గంజాయి మొక్క ద్వారా 250 నుంచి 300 గ్రాముల సగటు దిగుబడి వస్తుంది. ఎకరా విస్తీర్ణానికి వేయి కిలోల గంజాయి సాగవుతోంది. ప్రస్తుతం కిలో గంజాయి ధర రూ.2000 ఉంది. ఎకరా సాగుచేస్తే రూ.20 లక్షల ఆదాయం వస్తోంది. ఈ లెక్కల ప్రకారం విశాఖ మన్యంలో ప్రతిఏటా 5400 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నట్టు తెలుస్తోంది.

గిరిజనుల అమాయకత్వంతో...

ఏపీలోని మన్యంలో సాగవుతోన్న గంజాయిని గిరిజనుల అమాయకత్వంతో గమ్యానికి చేరుస్తున్నారు. వారి సహాయంతో కాలినడకన, గుర్రాల ద్వారా మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. మన్యంలో 22 ప్రాంతాల్లో వందలాది స్టాక్​పాయింట్లు ఉన్నాయి. అక్కడి నుంచి 26 రవాణా మార్గాల ద్వారా జాతీయ రహదారులు, ప్రధాన మార్గాలకు చేర వేస్తున్నారు. ఆ తర్వాత సరుకును సరిహద్దులు దాటిస్తూ కోట్లు గడిస్తున్నారు.

మన్యంలో "మత్తు సామ్రాజ్యం" ఇలానే రాజ్యమేలితే... "ఆంధ్రా భవిష్యత్తే ప్రశ్నార్థకం"గా మారే ప్రమాదముంది.

ఇదీ చదవండీ: సాగర తీరాన... పౌర్ణమి వేళ 'వెన్నెల్లో నడక'

Varanasi (UP) May 27 (ANI): After offering prayers at the Kashi Vishwanath temple, Prime Minister Narendra Modi addressed Bharatiya Janata Party (BJP) workers in Varanasi. PM said, "Political pundits/experts were relevant for the 20th century but not the 21st century." "Even the poor person on the ground has a better understanding than those with 50 pages of biodata, so many degrees and research papers and what not under their name, but Bharatiya Janata Party workers in Varanasi have better understanding than them," he added further.
Last Updated : May 29, 2019, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.