వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పక్కదారి పడుతున్నాయని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఒక్కొక్కరికి రెండు, మూడు ఇళ్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న ఇళ్లను స్థానిక ప్రజా ప్రతినిధులు కాజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులకు ఇవ్వకపోతే కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.