ETV Bharat / briefs

ప్రతిపక్షాల ఐక్యపోరాటం ఫలించింది: ఉత్తమ్​ - uttam

రాష్ట్రంలో ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపును వాయిదా వేస్తూ.. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్
author img

By

Published : May 25, 2019, 6:06 AM IST

స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపును వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్వాగతించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు, మండల పరిషత్తు అధ్యక్షులు, జిల్లా పరిషత్తు ఛైర్మన్ల ఎంపికకు మధ్య 40 రోజులు సమయం ఉంటుందని అఖిలపక్షం స్పష్టం చేసింది. ఈ మధ్యలో బేరసారాలకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డిని కలిసి విన్నవిన్నవించింది. డబ్బు, పదవులను ఆశ చూపి ఎంపీటీసీ, జడ్పీటీసీలను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.

సాంకేతిక పరంగా ఓట్ల లెక్కింపు పూర్తికాగానే ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్‌ల ఎన్నిక జరపడానికి... గత ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీకాలం అడ్డు వస్తోంది. లెక్కింపు వాయిదా వేయడం ఒకటే మార్గంగా భావించిన రాష్ట్ర ఎన్నికల సంఘం... ప్రతిపక్షాల వినతిపై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

స్వాగతిస్తున్నాం: ఉత్తమ్

ఈ అంశంపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.... తమ పోరాటం ఫలించిందని వ్యాఖ్యానించారు. అప్రజాస్వామిక పద్ధతులకు స్వస్తి పలకాలని తాము చేసిన వినతికి ఎన్నికల సంఘం అంగీకరించడం హర్షనీయమని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేసిన ఐక్య పోరాటం ఫలించిందన్న ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వివరించారు.

ప్రతిపక్షాల ఐక్యపోరాటం ఫలించింది

ఇవీ చూడండి: జులై నుంచి కాళేశ్వరం ఎత్తిపోతలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.