ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉల్లి సాగు ఎగుమతి చేసే స్థాయిలో లేకపోవటంతో.... దేవరకద్ర మార్కెట్ వెలవెలబోతోంది. ప్రతీ బుధవారం జోరుగా సాగే మార్కెట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వినియోగదారులే వ్యాపారులతో పోటీపడి మరి కొనుగోలు చేస్తున్నారంటే... ఉల్లికి ఉన్న డిమాండ్‌ని అర్థం చేసుకోవచ్చు. ఇదే అవకాశంగా తీసుకున్న వ్యాపారులు 45 కిలోల బస్తా ధర రూ. 650 నుంచి రూ. 750కి పెంచేశారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఉల్లి ధర ఇంకా పెరిగిపోయే అవకాశం ఉందని... అందుకే ఇప్పుడే తీసుకెళ్తున్నామని వినియోగదారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: మేము ఫెయిల్ అవుతూనే.. ఉండాలా?