విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి పదో తరగతి ఫలితాల్ని విడుదల చేశారు. 2018-19లో 92.43 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా జగిత్యాల జిల్లాలో 99.73 శాతం ఉత్తీర్ణతతో ప్రథమస్థానంలో నిలిచింది. పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లలు, వారి తల్లిదండ్రుల కృషి వల్లే ఇదంతా సాధ్యమైందంటున్నారు జిల్లా కలెక్టర్ శరత్. వరుసగా మూడో ఏడాది ఉత్తీర్ణతలో రాష్ట్రవ్యాప్తంగా తమ జిల్లా ప్రథమస్థానంలో నిలిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు. జూన్ 10 నుంచి 24 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని ఆయన తెలిపారు.
ఇదీ చదవండిః అప్పుల బాధలు భరించలేక రైతు మృతి