పదో తరగతి ఫలితాల వెల్లడిలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఫలితాల వెల్లడికి ముందు వివరాలను ఐదు అంచెల్లో తనిఖీ చేస్తున్నామన్నారు. ఫలితాలు వెల్లడి తరువాత ఎలాంటి సందేహాలున్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. విద్యార్థులు నేరుగా ఫిర్యాదు చేసేలా ఆన్‌లైన్‌లో ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఒక సబ్జెక్ట్‌లో అధిక మార్కులు వచ్చి, ఏదైనా సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయితే మరోసారి పరిశీలిస్తున్నామని విజయ్‌కుమార్ హామీ ఇచ్చారు. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తయినప్పటికీ... అన్ని సబ్జెక్టులను మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఫలితాల వెల్లడి తేదీని త్వరలోనే ప్రకటిస్తామని.... విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయ్‌కుమార్ భరోసా ఇచ్చారు.
ఇవీ చూడండి: నిన్న దీక్ష విరమణ... నేడు డిశ్చార్జ్...