ETV Bharat / briefs

జోరుగా ఇందూరులో తెరాస సభ - kavitha

రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై తనదైన శైలిలో కేసీఆర్ ఇందూరు సభలో ​మాట్లాడారు. దశాబ్దాలుగా ప్రజల పట్ల కాంగ్రెస్​, భాజపా విధానాలను తీవ్రంగా ఎండగట్టారు. దేశానికి ప్రత్యామ్నాయ పార్టీల అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ఎర్రజొన్న, పసుపు రైతులను ఆదుకుంటామని చెప్పిన గులాబీ బాస్​ రేపు ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.

తెరాస జోరు
author img

By

Published : Mar 20, 2019, 6:12 AM IST

Updated : Mar 20, 2019, 8:57 AM IST

తెరాస జోరు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానంలో తెరాస బహిరంగ సభ జరిగింది. లోక్​స‌భ నియోజ‌క వ‌ర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి వచ్చిన తెరాస శ్రేణులు, ప్రజలు కార్యకర్తలతో సభా పరిసరాలు మొత్తం గులాబీమయం అయ్యాయి. సాయంత్రం 7 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్న కేసీఆర్ వివిధ అంశాలపై దాదాపు 40 నిమిషాలపాటు ప్రసంగించారు.

రైతుల సమస్యలు పరిష్కరిస్తాం..

శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులు తెలంగాణకు ఆయువుపట్టుగా ఉండేవని... ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిరూపయోగ దశకు చేరుకున్నాయన్నారు కేసీఆర్​. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్దే.. మలిదశ తెలంగాణ ఉద్యమం గురించి ఆలోచన చేసినట్లు గుర్తు చేశారు. తెరాస ఆవిర్భావం తర్వాత నిజామాబాద్ నుంచే తొలి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారని చెప్పుకొచ్చారు. ఎర్రజొన్న, పసుపు రైతుల సమస్యలు పరిష్కరిస్తామని గులాబీ బాస్​ హామీ ఇచ్చారు. అయితే ఇతరుల మాటలు విని ఇబ్బందులు పడొద్దన్నారు. ఎన్నికల వేళ నేరుగా ప్రకటన చేయలేమని... జిల్లా ప్రజాప్రతినిధులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ప్రత్యామ్నాయ పార్టీలు కావాలి

జాతీయ రాజకీయాలపై తనదైన శైలిలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన స్ఫూర్తితోనే దేశ రాజ‌కీయ ప‌రిస్థితులు మారుస్తామ‌న్నారు. 70 ఏళ్ల పాలనలో కనీస సౌకర్యాలు లేకపోవడం దారుణమన్నారు. సరైన జల, విద్యుత్ పాలసీలు లేవని విమర్శించారు. కాంగ్రెస్, భాజపాలు అధికారంలోకి వచ్చినప్పుడల్లా పేర్లు మార్చడం తప్ప కొత్త పథకాలు తేలేదన్నారు. చిన్న చిన్న దేశాలు ముందుకు వెళ్తుంటే.. అన్ని అవకాశాలు, వనరులు ఉండి మనదేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉండడం బాధాకరమని పేర్కొన్నారు. దేశాభివృద్ధిపై సరైన దృక్పథం లేదని.. ఇందుకు ప్రత్యామ్నాయ పార్టీల అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఎర్ర‌జొన్న‌, ప‌సుపు రైతుల‌కు త్వ‌ర‌లోనే న్యాయం చేస్తామ‌ని ఎంపీ కవిత హామీ ఇచ్చారు. రైతుల స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయంటే మోదీ నియోజ‌క వ‌ర్గం వార‌ణాసి, రాహుల్ గాంధీ నియోజ‌క వ‌ర్గం అమేథిలో కూడా వెయ్యి మంది నిజామాబాద్ రైతులు నామినేష‌న్ వెయ్యాల‌ని సూచించారు. మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించేలా తెలంగాణ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతుంద‌ని క‌విత తెలిపారు.

భాజపాపై ధ్వజం

భాజపాపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రామ జన్మభూమి వివాదంపై వైఖరేంటి అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అడిగిన అంశంపై ఘాటుగా స్పందించారు. అయోధ్య పంచాయితీలు పార్టీల పని కాదని.. స్వామిజీలు చూసుకుంటారన్నారు. రామ జన్మభూమి అంశం సుప్రీం కోర్టులో నడుస్తోందని తెలిపారు. భాజపా రాజ‌కీయ పార్టీయా లేక మ‌త‌త‌త్వ పార్టీనా చెప్పాల‌ని లక్ష్మణ్​ను అడిగారు. ఇత‌ర మతాలను తిట్టినవారే హిందువులా అని ప్ర‌శ్నించారు. లక్ష్మణ్​ను డూప్లికేట్ హిందువ‌ని వ్యాఖ్య‌ానించిన కేసీఆర్... ఇక‌నైనా ఓట్ల రాజ‌కీయాలు మానుకోవాల‌ని హెచ్చరించారు.

అత్యధిక జనసమీకరణ ఉన్న నిజామాబాద్​ సభలో రేపు తెరాస లోక్​సభ అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు గులాబీ బాస్​ పేర్కొన్నారు.

ఇవీ చూడండి:సోషల్​ మీడియాలో తిడుతున్నరు:కేసీఆర్​

Intro:JK_TG_WGL_15_19_MIRCHI_FULL_RATE_DOWN_PKG_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) వాతావరణం అనుకూలించక గడ్డు పరిస్థితులను ఎదుర్కొని మిర్చి సాగుచేసిన కర్షకులకు నిరాశే మిగిలింది పురుగు మందుల ధరలు రెండింతలు కాగా సాగు దిగుబడులు మాత్రం సగానికి పడిపోయాయి పెరిగిన పెట్టుబడులకు మార్కెట్ ధరలను పోల్చి చూస్తే కూలి గిట్టడం లేదంటూ కన్నీటిపర్యంతం చెబుతున్నారు ఓరుగల్లు మిర్చి రైతులు

Body:ఆసియాలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ గా పేరుపొందిన ఎనుమాముల మార్కెట్ లో రైతులకు నిరాశే మిగులుతుంది అన్ని వేయ ప్రయాసలు కూర్చి సాగుచేసిన మిర్చి మార్కెట్ యార్డు తరలిస్తే కూలి పట్టడం లేదంటూ సాగుదారులు వాపోతున్నారు గత ఏడాదితో పోలిస్తే సాగు ఖర్చులు రెండింతలు పెరిగాయి మిర్చి తోటలను చీడపీడలు ఆశించి దిగుబడులను తగ్గించాలని చంపుతున్నారు చీడపీడల నుంచి తోటను కాపాడే కొనేందుకు పురుగు మందులను పిచికారి చేయడం తో సాగు ఖర్చులు ఆకాశాన్నంటాయని రైతన్నలు వాపోతున్నారు పెట్టిన పెట్టుబడికి మార్కెట్ ధర లతో పోల్చి చూస్తే ఏ మాత్రం ధరలు గిట్టుబాటు కావడం లేదని రైతులు మనోవేదనకు గురవుతున్నారు ఎకరం మిర్చి సాగు చేసేందుకు 50 వేల నుంచి 70 వేల వరకు ఖర్చు చేసిన దిగుబడి మాత్రం ఎనిమిది గంటలకు మించి రాలేదని కర్షకులు తెలిపారు ఇదిలా ఉంటే మార్కెట్ యార్డుకు మిర్చి రికార్డు స్థాయిలో రావడంతో వ్యాపారులు ధరలను నియంత్రిస్తున్నారు మట్టి మనుషులు ఆరోపిస్తున్నారు ప్రధానంగా మార్కెట్ యార్డ్ లో కు తేజ వండర్ హాట్ దీపిక యూఎస్ త్రీ ఫోర్ వన్ దేశి లాంటి రకాలు మార్కెట్ యార్డుకు వస్తున్నాయి గత ఏడాదితో పోలిస్తే 14000 పలికిన సింగిల్ పత్తి రకం 11 వేల మార్పును దాటడం లేదు తేజ రకం గరిష్టంగా 9000 పలికినప్పటికీ వ్యాపారులు మాత్రం 5000 ధర పెట్టడం లేదని రైతులు చెబుతున్నారు వండర్ హాట్ ఆరు వేలు దేశీ రకం పదివేల ధర పలుకుతున్నాయి నాణ్యత పేరుతో రంగు పేరుతో వ్యాపారులు ధరలను నియంత్రిస్తున్నారు అని కర్షకులు తెలిపారు. ఇది ఇలా ఉంటే వ్యాపారుల తీరుపై మార్కెట్ అధికారులు ను ప్రశ్నించిన రైతులను ధర నచ్చని పక్షంలో సరుకులు తీసుకో అంటూ అధికారులు చెప్పడం రైతులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది
బైట్
మిర్చి సాగు దారు
మిర్చి సాగు దారు
మిర్చి సాగు దారు
సంగయ్య మార్కెట్ కార్యదర్శి

Conclusion:రైతు సరుకులకు మంచి ధరలు పెట్టించిన అధికారులు వ్యాపారులకు మద్దతు కూడగట్టడం పై దర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు... ఇప్పటికైనా అధికారులు స్పందించి ధరల నియంత్రిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు
Last Updated : Mar 20, 2019, 8:57 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.