నేడు తెలంగాణతోపాటు దేశానికి పండుగ రోజని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా దిల్లీలోని తెలంగాణ భవన్లో తెరాస ఎంపీలు ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతలతో తెలంగాణ నీటి కష్టాలు తీరనున్నాయని కేశవరావు చెప్పారు. కాళేశ్వరం క్రెడిట్ అంతా కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు.
దిల్లీలో తెరాస ఎంపీల సంబురాలు ముందుచూపుతో నీటి కష్టాలను అధిగమించేందుకు కేసీఆర్ మూడేళ్ళలో ప్రాజెక్టు పూర్తి చేశారని లోక్‌సభాపక్షనేత నామ నాగేశ్వరరావు అన్నారు. సముద్రమట్టం నుంచి 618 మీటర్ల ఎత్తుకు గోదావరి నీటిని తీసుకెళ్లడం మామూలు విషయం కాదని తెలిపారు. ప్రపంచంలోనే పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం అని చెప్పారు.45 లక్షల ఎకరాలకు సాగునీరు, 80 శాతం ప్రజలకు తాగునీరు, పరిశ్రమలకు కావలసిన నీరు కాళేశ్వరం ద్వారా అందుతుందన్నారు.
ఇవీ చూడండి: కేసీఆర్ కల ఫలించిన వేళ...