తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యజిత్ బిస్వాస్ పై శనివారం రాత్రి దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. పశ్చిమబంగ నాదియా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది.
క్రిష్ణాగఢ్ నియోజకవర్గంలోని పూల్బరి ప్రాంతంలో సర్వసతి పూజకు హాజరైన సమయంలో దుండుగులు దుశ్చర్యకు పాల్పడ్డారు.
కాల్పులు జరిగిన వెంటనే సత్యజిత్ అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. ఎమ్మెల్యేను హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే అప్పటికే సత్యజిత్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.